పశ్చిమగోదావరి

తాడువాయిలో భారీ పరిశ్రమ స్థాపనకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 20 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తాడువాయిలో నిర్మించే పునరావాస కాలనీలో భారీ పరిశ్రమ స్థాపిస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి సౌకర్యాలు కాలనీలోనే లభిస్తాయని ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో పోలవరం నిర్వాసితుల ఇళ్ల కాలనీల నిర్మాణ ప్రగతి తీరుపై గృహ నిర్మాణ, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి, గిరిజన సంక్షేమం, తదితర శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తాడువాయి ప్రాంతంలో నిర్మించే ఇళ్ల కాలనీతోపాటు కాలుష్య రహిత పరిశ్రమ ఏర్పాటుకు కూడా భూమి కేటాయింపు చేయాలన్నారు. తద్వారా నిర్వాసితులకు సమీపంలోనే ఉపాధి కలిగే అవకాశాలు కలుగుతాయన్నారు. కాలుష్యం లేని టెక్స్‌టైల్స్ పరిశ్రమ లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా చూస్తామని చెప్పారు. తాడువాయి పోలవరం ప్రాజెక్టు పునరావాస కొత్త కాలనీలో కనీసం 15 వేల మందికి వౌలిక వసతులతో కూడిన ఇళ్ల కాలనీ ఏర్పాటు చేస్తున్నామని కనీసం 60 వేల మంది ప్రజలు ఈ కాలనీలో నివాసముండే అవకాశాలున్న దృష్ట్యా ఈ కాలనీలోనే భారీ పరిశ్రమ ఏర్పాటు వల్ల అక్కడే పని, అక్కడే నివాసం వల్ల బాధితులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. ముంపు బాధితులకు అయిదు శాఖల ఆధ్వర్యంలో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నామని ప్రతీ కాలనీలోనూ నాణ్యమైన రహదారి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని జాతీయ రహదారిని అనుసంధానం చేసేందుకు అనువుగా నాలుగు లైన్ల రహదారిని తాడువాయి కాలనీకి అనుసంధానం చేస్తామని దీని వలన ప్రజలకు రవాణా సౌకర్యాలు కూడా ఏర్పడతాయని చెప్పారు. పునరావాస ఇళ్ల కాలనీ పనులు వచ్చే వారం నాటికి టెండర్లు ఫైనల్ కావాలని యుద్ధప్రాతిపదికపై పనులు చేపట్టి ముంపు బాధితులకు శాశ్వత గృహ సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఇళ్ల కాలనీల నిర్మాణ ప్రగతి తీరుపై ప్రతీ రోజూ ఆయా శాఖాధికారులు సమగ్ర సమాచారాన్ని తనకు నివేదించాలని చెప్పారు. కార్యక్రమంలో జెసి పి కోటేశ్వరరావు, ప్రత్యేక కలెక్టర్ భాను ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ పిడి ఇ శ్రీనివాస్, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, ఆర్ అండ్ బి ఎస్‌ఇ నిర్మల తదితరులు పాల్గొన్నారు.