పశ్చిమగోదావరి

కేజి బేసిన్‌లో అభివృద్ధి బావుల డ్రిల్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 20: కేజి బేసిన్‌లో అభివృద్ధి బావులను చమురు, సహజ వాయువుల సంస్థ (ఒఎన్‌జిసి) డ్రిల్లింగ్ చేయనుంది. నరసాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో మొత్తం 10 బావులను ఎంపిక చేశారు. వీటిని డ్రిల్లింగ్ చేసేందుకు ఒఎన్‌జిసి రూ.110 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. 5 నుంచి 6 ఎకరాల వరకు వ్యవసాయ భూమి అవసరమవుతోంది. ఈ పనులను కనీసం నాలుగు మాసాల సమయం కూడా పడుతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణను శనివారం భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగేంద్రపురం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటుచేశారు. ఒఎన్‌జిసి జనరల్ మేనేజర్ (మెకానికల్) కెఎస్ రత్నం, హెడ్ హెచ్‌ఎస్‌ఇ విఆర్‌కెఎస్ శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎండి హాసిం షరీఫ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి వెంకటేశ్వరరావు, సబ్ సర్వీసెస్ ఇన్‌చార్జి ఎస్‌ఎస్ రెడ్డి, వివిధ రైతు సంఘాలు, ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీలు, అభివృద్ధి బావులు డ్రిల్లింగ్ చేసే ప్రాంతాలకు చెందిన గ్రామస్థులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒఎన్‌జిసి ప్రతినిధులు తమ సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. చాలామంది డెల్టా ప్రాంతానికి చెందిన వారు ఒఎన్‌జిసి బావులను తవ్వడం వల్ల భూమి దిగిపోయి, కృంగిపోయే అవకాశం ఉందని చెప్పారని, గతంలో ఇదే అంశంపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని, దానిపై న్యాయస్థానం ప్రకటించిన తీర్పు ఒఎన్‌జిసికి అనుకూలంగా వచ్చిందని అన్నారు. ప్రజలు అటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎండి హసీం షరీఫ్ మాట్లాడుతూ ఒఎన్‌జిసి రాష్ట్రంలోని కేజి బేసిన్‌లోని రెండు పిఎంఎల్ బ్లాకులైన పశ్చిమ గోదావరి, గోదావరి ఆన్‌లాండ్ ప్రాంతాల్లో చమురు, సహవాయువు ఉత్పత్తి కోసం అభివృద్ధి తవ్వకాలను తలపెట్టిందన్నారు. ఈ బ్లాకులు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించబడ్డాయని, ప్రస్తుత ప్రతిపాదన కింద పర్యావరణ అనుమతులను 72 అభివృద్ధి బావుల తవ్వకానికి అనుమతులు అడిగామని అన్నారు. వీటిలో 14 స్థానాలు కృష్ణా జిల్లాల్లోను, 2 పశ్చిమ గోదావరి జిల్లా, 56 స్థానాలు గోదావరి పిఎంఎల్ బ్లాకు పరిధిలో ఉన్నాయన్నారు. జనరల్ మేనేజర్ కెఎస్ రత్నం మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణ ప్రభావ విశే్లషణ, పర్యావరణ నిర్వహణ ప్రణాళికతో జిల్లాలోని 10 అభివృద్ధి బావుల తవ్వకంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, గోదావరి ఆన్‌లాండ్ పిఎంఎల్ బ్లాకులు, కేజి బేసిన్‌లో ఉన్న 72 ప్రతిపాదిత అభివృద్ధి బావుల తవ్వకాల కార్యకలాపాలకు మొత్తం రూ.792 కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ అభిప్రాయ సేకరణకు హాజరైన వారిలో కొందరు వ్యతిరేకించారు. బావుల తవ్వకాలను వ్యతిరేకించిన వారి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు వారికి స్పష్టం చేశారు.