పశ్చిమగోదావరి

చుక్కలనంటిన కొబ్బరి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జనవరి 20: టెంకాయ ధర టాపు లేపుతోంది. రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న కొబ్బరి ధరలు వ్యాపారులకు, వినియోగదారులకు చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ఆలయాల వద్ద వీటిని కొనుగోలు చేసే భక్తులు లబోదిబోమంటున్నారు. పెరుగుతున్న ధర కారణంగా రోజు రోజుకు విక్రయాలు పడిపోతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కొబ్బరి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడమే ఇక్కడ ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇప్పటివరకు తమిళనాడులోని తంజావూరు, సేలం, కరూర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో అక్కడి కొబ్బరి తోటలు పూర్తిగా నాశనమై దిగుబడి బాగా తగ్గింది. ఈ కారణంగా ఆ రాష్ట్రాల నుండి వేరే ప్రాంతాలకు సరఫరా అయ్యే కొబ్బరి ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుండటంతో మన అవసరాలకు కొరత ఏర్పడింది. ఈ కారణంగానే కొబ్బరి ధర కొండెక్కి కూర్చుంది.
ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 23 వేల హెక్టార్లలో రైతులు కొబ్బరిని సాగు చేస్తున్నారు. అలాగే కొత్తగా 1600 హెక్టార్లలో పంటను వేశారు. సాధారణంగా ఒక హెక్టారుకు 15 వేల కాయలు దిగుబడి వస్తుంది. జిల్లా నుండి రోజూ వివిధ ప్రాంతాలకు 20 లక్షల కొబ్బరికాయలు ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళలో దిగుబడి కొబ్బరి దిగుబడి తగ్గడంతో ఆ రాష్ట్రాలపై ఆధారపడిన ప్రాంతాలకు ఇక్కడి నుండి కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో మన అవసరాలకు సరిపడ సరకు లేక ఉన్నదానికి డిమాండ్ పెరిగి ధరలు మండిపోతున్నాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం తదితర మార్కెట్లలో ఒక్కో కొబ్బరి కాయ ధర రూ.20 నుండి రూ.22లకు పెరుగుతుంటే ఆలయాల వద్ద వ్యాపారులు వాటిని రూ.30లు పైబడి విక్రయిస్తున్నారు. దాంతో భక్తులు బెంబేలెత్తుతున్నారు. సైజుతో సంబంధం లేకుండా అన్ని కాయలూ ఒకేధర పలుకుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో లేతకాయలను సైతం చెట్ల నుండి దింపేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రముఖ ఆలయమైన ద్వారకాతిరుమలలో భక్తుల రద్దీగా ఉండే శని, ఆదివారాల్లో దాదాపు 20 వేలకు పైబడి కొబ్బరికాయల అమ్మకాలు జరిగేవి. అయితే ధర అధికంగా ఉండటంతోబాటు లేత కొబ్బరికాయలు రావడంతో అమ్మకాలు బాగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
కట్టుకున్నోళ్ల చేతిలో తల్లీకూతుళ్లు హతం
బుట్టాయగూడెం, జనవరి 20: కట్టుకున్నోళ్ల చేతిలోనే ఆ తల్లీకూతుళ్లు హతమైపోయారు.... కన్నతండ్రి, కట్టుకున్నోడు.. కూతురిపాలిట యములైతే, కట్టుకున్నోడు, అల్లుడు ... తల్లిపాలిట యములయ్యారు... మామ అల్లుడు ఒకటయ్యారు... కుట్రకు చేతులు కలిపారు. తల్లీకూతుళ్లను నమ్మించి, కిరాతంగా కడతేర్చారు. పోలవరం సిఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం మండలం లక్ష్మీనారాయణదేవిపేట (ఎల్‌ఎన్‌డిపేట)కు చెందిన ఇళ్ల రామాంజనేయులు అలియాస్ అంజి (46), సావిత్రి (40) భార్యాభర్తలు. వీరి కుమార్తె మంగతాయారు (19). మంగతాయారుకు పులిబోయిన నాగరాజు (26)తో కొంతకాలం క్రితం పెళ్ళయింది. అందరూ ఎల్‌ఎన్‌డి పేటలో నివసిస్తున్నారు. కొద్ది నెలలుగా అంజి, సావిత్రిల మధ్య సత్సంబంధాలు కొరవడడంతో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు పోలీసు కేసుల వరకు వెళ్ళి, విడివిడిగా ఉంటున్నారు. భర్తపై సావిత్రి మెయింటెనెన్స్ కేసు కూడా వేసినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మంగతాయారు, నాగరాజులది కూడా కలహాల కాపురమే అయ్యింది. వీరిద్దరి మధ్య గొడవలు కూడా తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే మామా అల్లుళ్ళ కుట్రకు తెర లేచింది. తల్లీకూతుళ్ళను హతమారిస్తే, సమస్యలు తీరిపోతాయని అనుకున్నారో ఏమో.. తల్లీకూతుళ్ళ హత్యకు చకచకా పావులు కదిపారు. నాగరాజు తన భార్య దగ్గరకు వెళ్ళి, ఇకపై బాగా చూసుకుంటానని, కన్నాపురంలో కాపురం పెట్టుకుందామని నమ్మబలికాడు. కన్నాపురంలో ఇల్లు తీసుకున్నాను, చూడటానికి రమ్మని మామా అల్లుళ్లైన నాగరాజు, అంజి కలిసి మంగతాయారును మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని, కోటరామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం పక్కనుండి యర్రాయిగూడెం వెళ్ళే రహదారిలో జీడిమామిడితోట దగ్గరకు తీసుకువెళ్ళి, తాడు మెడకు బిగించి, ఊపిరాడకుండా చేసి, హత్యచేసి, అనంతరం ముందుగా తవ్వి ఉంచిన గోతిలో ఉంచారు. అనంతరం తిరిగి ఎల్‌ఎన్‌డిపేట చేరుకుని కూతురు మంగతాయారు కన్నాపురంలో ఇల్లు చూడటానికి వెళ్ళింది, నీవు కూడా రమ్మని సావిత్రిని కూడా నమ్మించి, మోటారుసైకిల్‌పై కోటరామచంద్రపురం జీడిమామిడితోట దగ్గరకు తీసుకువచ్చారు. మంగతాయారును హతమార్చిన విధంగానే మెడకు తాడు బిగించి, సావిత్రిని కూడా హతమార్చి, అదే గోతిలో ఉంచి, మట్టితో కప్పెట్టి, చేతులు దులుపుకున్నారు. గత ఏడాది నవంబర్ 8వ తేదీన తల్లీకూతుళ్ళు సావిత్రి, మంగతాయారులు కనబడటంలేదని సావిత్రి తల్లి కొండా గంగాయమ్మ (గుడ్డిగూడెం) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవంబర్ 28వ తేదీన పోలవరం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటినుండి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు లభించిన ఆధారాలతో మామాఅల్లుళ్ళైన అంజి, నాగరాజులను తమదైన బాణీలో విచారించగా శుక్రవారం రాత్రి నిందితులు వివరాలు వెల్లడించినట్లు చెప్పారు. నిందితులు వెల్లడించిన వివరాలతో శనివారం పోలవరం డీఎస్పీ ఎటివి రవికుమార్, ఎస్సై శ్రీహరిరావు, బుట్టాయగూడెం ఎస్సై ఎ.దుర్గారావు, బుట్టాయగూడెం తహసీల్దార్ జి.ఉదయభాస్కర్, కె.ఆర్.పురం విఆర్వో వెంకటేశ్వరరావు, విఆర్‌ఎ ఎం.విజయ ఆధ్వర్యంలో జీడిమామిడితోటలో పూడ్చిన మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టమ్‌కు తరలించారు.