పశ్చిమగోదావరి

కన్నుల పండువగా శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జనవరి 21: స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామివారి ఆలయంలో శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం ఆదివారం కన్నుల పండువుగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కల్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంజనేయ స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన, తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పూజా మండపంలో శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ), ఛైర్మన్ యిందుకూరి రంగరాజు పర్యవేక్షించారు. కాగా, స్వామివారి ఉపాలయం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిస్టాంత వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్టు ఛైర్మన్ రంగరాజు, కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు.
గో సంరక్షణతో శాంతి సామరస్యం
ఏలూరు, జనవరి 21: గో సంరక్షణతో సమాజంలో శాంతి సామరస్యతకు, హిందూ ధర్మోధ్ధరణకు దోహదపడుతుందని సినీ నటుడు వేణు అన్నారు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో గో సంరక్షణ సమితి శతాబ్ది ఉత్సవాలను ఆదివారం నిర్వహించారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ మెంబర్ ఎస్ ఎంఆర్ పెదబాబు దంపతులు జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 108 మంది దంపతులు గోపూజలు నిర్వహించారు. గోవుల అందాల పోటీలను కూడా జరిపారు. కళాకారులు కోలాటాలను ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు వేణు మాట్లాడుతూ సర్వ దేవతా స్వరూపిణి అయిన గోవును ఆరాధించడం హిందూ ధర్మమన్నారు. గోవులను పరిరక్షించి, సమాజానికి వాటి ప్రాముఖ్యతలను వివరిస్తున్న గో సంరక్షణ సమితి నిర్వాహకులను అభినందించారు. గో సంరక్షణ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా వేణుకు గోవు ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సమితి గౌరవాధ్యక్షులు బ్రిజ్‌గోపాల్ లునాని, అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మునగాల నాగ వెంకట మురళీకృష్ణ, పరిపాలనా కార్యదర్శి రామారావు, కోశాధికారి బాదం సాంబశివరావు, సభ్యులు కడియాల వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పైడి భీమేశ్వరరావు దంపతులు సామూహిక గోపూజలు నిర్వహించిన దంపతులను వస్త్రాలతో సత్కరించారు. నూరు వసంతాల ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.