పశ్చిమగోదావరి

టీడీపీ పాలనలోనే దళితులకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి16: తెలుగుదేశం పాలనలోనే రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగిందని, దళితుల అభ్యున్నతికి పార్టీ వ్యవస్థాపకులు, అన్న నందమూరి తారకరామారావు గట్టిపునాది వేసారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. మండలంలోని లక్కవరంలో శుక్రవారం దళిత తేజం - తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కవరం దళిత వాడలో అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధులు వారి ఆవాసాలలో ఖర్చు చేయకుండా, వారి అభ్యన్నతికి ఖర్చు పెట్టకుండా హైదరాబాద్‌లో రింగ్‌రోడ్లకు మళ్లించిన చరిత్ర కాంగ్రెస్ పాలనలో ఉందన్నారు. తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు కేటాయించిన నిధులు దళితుల అభ్యున్నతికే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. లక్కవరం గ్రామ అభివృద్ధికి ఈ నాలుగేళ్లలో రెండు కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లకు 30 లక్షలు మంజూరు చేయించినట్టు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తికాగానే మరో 30 లక్షలు మెయిన్ రోడ్డు నుండి దళిత వాడ రోడ్డుకు మంజూరు చేయిస్తానని చెప్పారు. దేవులపల్లి నుండి లక్కవరం మీదుగా చేబ్రోలు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందన్నారు. త్వరలో నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. అనంతరం దళిత పేటలో ఎంపీటీసీ ఆరుగొల్లు సావిత్రి ఇంటి వద్ద దళితులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.

వేడుకగా శ్రీపుష్ప యాగోత్సవం
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 16: శివదేవుని ఆలయంలో స్వామివారికి శుక్రవారం సాయంత్రం శ్రీ పుష్ప యాగోత్సవం వేడుకగా జరిగింది. దీంతో శివదేవుని కల్యాణ మహోత్సవాలు పరిసమాప్త మయ్యాయి. స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం నుండి విశేష పూజాదికాలు జరిగాయి. గర్భాలయంలో కొలువైన శివయ్యకు విశేష అభిషేకాలు చేశారు. రాత్రి ఆలయంలో గంగాపార్వతీ సమేత శివదేవునికి శ్రీ పుష్పయాగోత్సవాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో వేడుకగా జరిపారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు పర్యవేక్షించారు.

శ్రీవారి క్షేత్రానికి పాదయాత్ర భక్తుల తాకిడి
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 16: చిన వెంకన్న క్షేత్రానికి శుక్రవారం సాయంత్రం పాదయాత్రగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. శనివారం నెలపొడుపు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాత్రికులు అయ్యవరం, రాళ్లగుంట, భీమడోలు మీదుగా ఆలయానికి వచ్చారు. విశేష సంఖ్యలో కాలినడకన వచ్చిన భక్తులకు దేవస్థానం నిత్యాన్నదాన సదనంలో రాత్రి భోజన సౌకర్యం కల్పించింది. వీరంతా శనివారం తెల్లవారుజామున స్వామి తొలి దర్శనం చేసుకుంటారు.