పశ్చిమగోదావరి

పనిచేయగల సామర్ధ్యాలను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 16: క్లిష్టపరిస్ధితులను కూడా ఎదుర్కొని పనిచేయగల సామర్ధ్యాలను విద్యార్ధినులు అందిపుచ్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం జరిగిన స్ధానిక సర్ సిఆర్‌ఆర్ మహిళా కళాశాల దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టుకతోనే ఎవరు మహానుభావులు కారని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రయత్నలోపం లేకుండా శ్రమతోనే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. ఈక్రమంలో పేపర్‌బాయ్‌గా పనిచేసి ప్రముఖ శాస్తవ్రేత్తగాను, దేశ ప్రధమపౌరునిగాను ఎదిగిన మాజీ రాష్టప్రతి దివంగత అబ్దుల్ కలామ్ జీవితవిశేషాలు, మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌శాస్ర్తీ, దుర్గ్భాయ్‌దేశ్‌ముఖ్‌ల జీవితాలను వివరించారు. చదివిన పాఠ్యాంశాలను పలుమార్లు మననం చేసుకుంటే నూరుశాతం ఫలితాన్ని చూస్తారని విద్యార్ధినులకు ఉద్భోదించారు. దీనికి ఏకాగ్రత అవసరమన్నారు. ఇంటర్ వరకు తాను సాధారణ విద్యార్ధిగానే ఉన్నానని, డిగ్రీ నుండి అన్ని కోర్సుల్లోనూ టాపర్‌గా ఉంటో గోల్డ్‌మెడల్స్‌ను సాధించగలిగానన్నారు. విద్యార్ధినులు భయం, ఒత్తిడి, నిందమోపడంలను వీడి మనోసామర్ధ్యాన్ని కలిగిఉంటే ఎలాంటి విపత్కరపరిస్ధితులైనా ఎదుర్కొనగలరని పేర్కొన్నారు. సిఆర్‌ఆర్ విద్యాసంస్ధల అధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఇప్పటి విద్యార్ధినులదేనని పేర్కొన్నారు. చదువుతోపాటు ఇటీవల జరిగిన సిఆర్‌ఆర్ ఫెస్ట్ 2018లో మహిళా కళాశాల విద్యార్ధినులు సత్తా చాటారని ప్రశంసించారు. విద్యాసంస్ధల కార్యదర్శి ఎన్‌వికె దుర్గారావు, కళాశాల ప్రిన్సిపాల్ పి శైలజ తదితరులు మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పిజి కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధినులకు బహుమతులను న్యాయమూర్తి సునీత బహుకరించారు. అనంతరం విద్యార్ధినులు జానపద నృత్యాలు, నాటికలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.