పశ్చిమగోదావరి

సరైన వ్యవస్థను రూపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20: భారత రాజ్యాంగం కుల,మత,జాతి బేధాలు లేకుండా అందరికి సమన్యాయాన్ని అందించిందని, దాన్ని సరైనవిధంగా వినియోగించుకునేవిధంగా వ్యవస్ధను రూపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్ధ కార్యదర్శి కె శైలజ పేర్కొన్నారు. స్ధానిక సర్ సిఆర్‌ఆర్ అటానమస్ కళాశాలలో మంగళవారం సెట్‌వెల్, యువజన సర్వీసులశాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయదినోత్సవాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజ మాట్లాడుతూ సామాజిక న్యాయం అందరికి అందించేందుకు యువత తమ శక్తిసామర్ధ్యాలను సామాజిక ప్రయోజనాలకు వినియోగించాలని సూచించారు. సమన్యాయానికి రాజ్యాంగంలో అందుబాటులో ఉన్న చట్టాలు, అవకాశాలను విద్యార్ధులకు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ యుఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ డాక్టరు బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికతతో రూపొందించిన రాజ్యాంగంలోని అన్ని అవకాశాలు సమాజంలోని అట్టడుగు ప్రజానీకానికి అందినప్పుడే వారి కృషి నెరవేరుతుందన్నారు. సెట్‌వెల్ సిఇఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2007 ఫిబ్రవరి 20వ తేదీన ప్రపంచ సమన్యాయ దినోత్సవాన్ని ప్రకటించిందని, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచంలో మానవులందరూ సమానమనే భావన ప్రజలలో అవగాహన కల్పించటం అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎన్‌వివిఎస్ ప్రసాద్, సెట్‌వెల్ మేనేజరు ఎం ప్రభాకర్, ఆంగ్ల అధ్యాపకులు ఎం గురుప్రతాప్‌రెడ్డి, డాక్టరు కొండా రవి, కళ్యాణి, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.