పశ్చిమగోదావరి

మృత్యుఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం/నల్లజర్ల/పాలకొల్లు, ఏప్రిల్ 19: జిల్లాలో మంగళవారం మృత్యువు కరాళనృత్యం చేసింది. రెండు రోడ్డు ప్రమాదాలు సహా మూడు ఘటనల్లో మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు స్నేహితులు కాగా, ఇద్దరు తండ్రీకూతుళ్లు, ఇంకో ఇద్దరు చిన్నారి అక్కాచెల్లెళ్లు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. పాలకొల్లువద్ద రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. భీమవరంలో ఆటలాడుకుంటూ నిలిపివుంచిన కారులోకి ఎక్కిన ముగ్గురు చిన్నారి అక్కాచెలెళ్లల్లో ఇద్దరు ఊపిరాడక మృతిచెందారు. మరో బాలిక ప్రాణపాయస్థితిలో చికిత్స పొందుతోంది.
తెల్లవారుజాము నుండి రాత్రి వరకు జరిగిన ఈ విషాద ఘటనలను ఒకసారి పరిశీలిస్తే...గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు స్నేహితులను ఆగివున్న లారీ మృత్యువు రూపంలో కాటేసింది. వారు ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఆగివున్న లారీని ఢీకొనగా, అదే సమయంలో వెనుక వస్తున్న మరోలారీ కారును ఢీకొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి నబీపేట రోడ్డువద్ద జరిగిన ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగాగర్లపాడుకు చెందిన కటికాల శ్రీనివాసరావు (46), ముత్యాలంపాడుకు చెందిన మద్దినేని వెంకటకృష్ణ (28), గురజాల మండలం పులిపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు (35) మృతిచెందారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఒక పెట్రోలు బంకు లీజు ఖరారు చేసుకుని కారులో స్వస్థలానికి బయలుదేరిన వీరు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రెండు లారీల మధ్య ఇరుక్కున్న కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కొర్రా నాయక్‌బాషా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతనిని 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. మృతుల్లో కటికాల శ్రీనివాసరావుకు భార్య వరలక్ష్మి, కుమారులు మణి, అశోక్ ఉన్నారు. వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ప్రత్తిపాటి శ్రీనివాసరావుకి భార్య పుష్పలత, నాలుగేళ్ల కుమారుడు సాయి, మూడేళ్ల కుమారుడు యశ్వంత్ ఉన్నారు. మద్దినేని వెంకటకృష్ణది దాచేపల్లి మండలం ముత్యాలంపాడు అయినా గుంటూరులో స్థిరపడ్డారు. అతనికి భార్య అనూష, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. సంఘటనాస్థలాన్ని కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం గ్రామీణ సిఐ జి మధుబాబులు సందర్శించారు. అనంతపల్లి ఎస్సై బిఎన్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక వివాహ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగివస్తున్న తండ్రీ కూతుళ్లను ట్రాక్టరు రూపంలో మృత్యువు కబళించింది. పాలకొల్లు లారీ స్టాండు వద్ద ఈప్రమాదం సంభవించింది. పాత నవరసపురం గ్రామానికి చెందిన శీలబోయిన విఘ్నేశ్వరరావు (60), కుమార్తె కడలి సుజాత (36)తో కలిసి పెనుమంట్ర మండలం భట్లమగుటూరులో ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్తె సుజాత తలపై నుండి ట్రాక్టర్ చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉన్న విఘ్నేశ్వరరావును 108 వాహనంపై పాలకొల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. విఘ్నేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె సుజాత భర్త గల్ఫ్‌లో ఉండటంతో తండ్రి వద్దే ఉంటోంది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అమ్మాయి శాంతిభవాని పాలిటెక్నిక్ చదువుతుండగా, కుమారుడు పార్థసాయి ఇంటర్ చదువుతున్నాడు. కాగా ప్రమాద స్థలంలో విఘ్నేశ్వరరావు భార్య వీరరాఘవమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. పాలకొల్లు పట్టణ సిఐ రజనీకుమార్ నేతృత్వంలో పట్టణ ఎస్సై రామకృష్ణ కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన (ఎపి 5 సివి 5944) ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండటం వల్ల వివరాలు అందలేదు. తామంతా చూస్తుండగానే ఈ ప్రమాదం జరగటం ఎంతో విచారకరమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
భీమవరం బ్యాంకు కాలనీలో చోటుచేసుకున్న మరో విషాద ఘటనలో ఈశ్వరి (6), లక్ష్మీదుర్గ (4) అనే చిన్నారులు మృతిచెందారు. స్థానికంగా తాత యిర్రింకి లక్ష్మీనారాయణవద్ద తేజస్విని (9), ఈశ్వరి, లక్ష్మీదుర్గ అనే అక్కాచెల్లెళ్లు ఉంటున్నారు. మంగళవారం ఉదయం పాఠశాల నుండి తిరిగివచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. అయితే ఎంతకీ వారు తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. చివరకు రాత్రి 99గంటల ప్రాంతంలో వారి ఇంటికి సమీపంలోని ఒక కారులో అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించి, హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈశ్వరి, లక్ష్మీదుర్గ మృతిచెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న తేజస్వినిని ఏలూరు తరలించారు. బాలికల తల్లిదండ్రులు పాలకోడేరు మండలం కుముదవల్లిలో నివాసం ఉంటున్నారు.
ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న భీమవరం మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.