పశ్చిమగోదావరి

జగన్‌వి అన్నీ చీకటి ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20: రాష్ట్రప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ పేర్కొన్నారు. అయితే విపక్షనేత జగన్ మాత్రం అవగాహనారాహిత్యంతో చేస్తున్న విమర్శలు సరికాదని చెప్పారు. ఆయనవన్ని చీకటి ఒప్పందాలేనని విమర్శించారు. విభజన హామీల అమలును పక్కనపెట్టి రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెట్టి కేంద్రంతో చీకటి ఒప్పందాలు పెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. స్ధానిక జడ్పీ అతిధిగృహంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల దగ్గే ప్రయోజనాలన్నీ అందే విధంగా ప్రత్యేక సహాయం అందిస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పిందన్నారు. అయితే కొంతవరకు రాష్ట్రానికి మేలు జరిగినా పూర్తిస్ధాయిలో జరగలేదన్నారు. ప్రతిష్టాత్మకమైన రీతిలో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్న దృష్ట్యా వాటికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్రం నుంచి సహాయం అందుతుందని ఇంతవరకు ఎదురుచూశామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నారన్నారు. అయితే ప్రత్యేక హోదాపై అవగాహనారాహిత్యంతో విపక్షనేత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్నారు. ఆయనకు పార్లమెంటు, అసెంబ్లీ వ్యవహారాలు, నిబంధనలపై ఏమాత్రం అనుభవం లేదని విమర్శించారు. కేవలం అవిశ్వాసతీర్మానంతో ప్రత్యేకహోదా రాదని, సమయానుకూలంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 13జిల్లాల్లో వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతోందని మంత్రి చెప్పారు. నెల్లూరులో శ్రీ సిటీ, చిత్తూరులో కియా మోటార్స్, అలాగే మిగిలిన జిల్లాల్లో పలుసంస్ధలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. దళితులను ఇంతకాలం అన్ని పార్టీలు ద్రోహం చేశాయని, అది గుర్తించిన దళితులు టిడిపికి దగ్గరవుతున్నారన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఎంఆర్‌పిఎస్ మహాసభ విజయవంతంగా జరిగిందన్నారు. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి డప్పుకళాకారులకు 1500 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించటంతోపాటు లిడ్‌క్యాప్ ద్వారా మరింత సహాయం అందిస్తామని ప్రకటించారన్నారు. ప్రభుత్వం జివో 25 ద్వారా దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్ధాయిలో అమలుచేస్తోందన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు మేలు జరుగుతోందని, ప్రధానంగా మాదిగలకు ఒక గుర్తింపు తీసుకువచ్చారని చెప్పారు. సమావేశంలో దళిత నాయకులు పెరికే వరప్రసాద్, పొలిమేర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం పరిహారం
-జాతీయ రహదారి విస్తరణ బాధితులతో జేసీ-2 షరీఫ్
వీరవాసరం, ఫిబ్రవరి 20: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతుల వద్ద నుండి ప్రభుత్వం తీసుకుంటున్న భూములకు సంబంధించి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని భూసేకరణ జాయింట్ కలెక్టర్ మహ్మద్ అషీం షరీఫ్ అన్నారు. మంగళవారం వీరవాసరం తహసీల్దారు కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న వారిలో కొందరు చేసుకున్న దరఖాస్తులపై జెసి మాట్లాడారు. జాతీయ రహదారి విస్తరణ వీరవాసరం మండలంలోని పెర్కిపాలెం, నందమూరిగరువు, వీరవాసరం, వడ్డిగూడెం గ్రామాల పరిధిలోంచి వెడుతుందన్నారు. అయితే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ అంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న భూములే తమకు జీవనాధారమని, ప్రభుత్వం నిర్ణయించిన రేటు కాకుండా మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. మరికొందరు ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ ఎలైన్‌మెంటును మార్చాలని సూచించారు. సంబంధిత రైతుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. దీనికి సంబంధించి సమాచారాన్ని తాము ఉన్నతాధికారులకు పంపుతామని, నిర్ణయాధికారాలన్నీ వారికే ఉంటాయన్నారు. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే వీరవాసరం తహసీల్దారు కార్యాలయంలో అందచేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దారు ఎం ముక్కంటి, ఆర్‌అండ్‌బి ఈఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.