పశ్చిమగోదావరి

మళ్లీ రాజుకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 22: ఇంతకాలం ఉప్పునిప్పులా మారిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుల మధ్య వివాదం ముదిరి పాకానపడినట్లు కన్పిస్తోంది. ఇంతకాలం వర్గవైరుఢ్యాలతో, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో వారి మధ్య మాటల యుద్ధం సాగుతూనే వచ్చింది. అయితే ఈవ్యవహారం తాజాగా మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలతో మరింత రాజుకున్నట్లు కన్పిస్తోంది. టిడిపి, బిజెపి పార్టీలను ఉదహరిస్తూనే మంత్రి పైడికొండల ‘కొండకు వెంట్రుక వేశాం, వస్తే కొండ, లేకుంటే వాళ్లకి బోడిగుండు’ అన్నట్లు చేసిన ఈ వ్యాఖ్యల వ్యవహారం కొంత స్ధబ్ధుగా ఉన్న వీరిమధ్య మరింత అగ్గిరాజేసినట్లు కన్పిస్తోంది. గురువారం నాటి పరిణామాల్లో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తన ఛాంబరులో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మంత్రిపై తీవ్రస్ధాయిలోనే విరుచుకుపడ్డారు. బిజెపి పార్టీని వెంట్రుక స్ధాయేనన్నట్లు ఆయన ఒప్పుకున్నారని, ఇదే సమయంలో చంద్రబాబు మంచితనంతో మంత్రిగా కేబినెట్‌లో కొనసాగుతున్న ఆయన వాళ్లకి బోడిగుండు తప్పదన్నట్లుగా వ్యాఖ్యానించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన విస్తృతంగా మాట్లాడి మంత్రివర్గం నుంచి తప్పుకుంటేనే కొంతైనా నైతికత ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే ఒకళ్లు తప్పుకుంటే మరొకరు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యానించటం సమంజసం కాదన్నారు. అదే జరిగితే ఆ పార్టీని పట్టుకుని వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. దీంతోపాటు అసలు జిల్లాకు ఏం చేశారంటూ పలు ప్రశ్నలు సంధించారు. మంత్రితోపాటు నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజును కూడా కలిపి ఏకమొత్తంగా విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిగూడెం నిట్ తానే తీసుకువచ్చానని చెప్పుకునే మంత్రి ఆ నిర్మాణానికి కేంద్రం నుంచి ఏమేరకు నిధులు తీసుకువచ్చారని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వం వందల కోట్ల విలువైన 176 ఎకరాలను కేటాయించిందని, కనీసం ప్రహారీగోడ స్ధాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. టిడిపి, బిజెపి కూటమికి జిల్లా ఏకమొత్తంగా మద్దతు పలికిందని, ఆఫలితంగానే అటు నర్సాపురంలో, ఇటు తాడేపల్లిగూడెం బిజెపి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. అయితే ఎన్నికైన నాటినుంచి ఇప్పటివరకు జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయప్రధానమైన జిల్లాలో పరిశ్రమలు రావడానికి అనువుగా 16వేల ఎకరాల అటవీభూమిని డీనోటిఫై చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఆవిషయంలో కేంద్రం నుంచి కొంతైనా సానుకూలస్పందన రాబట్టారా అని ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని జిల్లాలో చేసి చూపించామని ఛైర్మన్ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడాలేనిరీతిలో గ్రామీణప్రాంతాలలో భారీఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశామని, ఈవిధంగా బిజెపి పాలిత ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా అని ప్రశ్నించారు. మీరెక్కడైనా జరిగిందని నిరూపించగలిగితే తాను పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. ఇక ప్యాకేజీలు, హోదాలు అంశాలపై కూడా మాట్లాడుతూ 2016లో ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, హోదాతో సమానమని నమ్మించిందని పేర్కొన్నారు. అప్పటినుంచి ఏమి మాట్లాడని కొన్ని పార్టీలు, నాయకులు ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి వచ్చి హోదా కోసం పోరు అంటూ రంగప్రవేశం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి కేవలం తప్పుడు లెక్కలు చూపి రాష్ట్భ్రావృద్ధికి సహకరిస్తున్నట్లుగా చెపుతోందన్నారు.

ఎంగిలి మెతుకులు విదిల్చి.. దబాయింపా?
* ధర్నాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి*ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ భారీ ర్యాలీ
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 22: విభజన చట్టం అమలు చేయకపోవడమే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఎంగిలి మెతుకులు విదిల్చి ఇప్పుడు బీజేపీ నేతలు దబాయింపు మొదలుపెట్టారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాధరావు నాయకత్వంలో గురువారం జంగారెడ్డిగూడెంలో ఆంధ్రుల ఆత్మగౌరవదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ తులసిరెడ్డి, జెట్టి గురునాధరావు తదితర రాష్ట్ర నేతలు ఎడ్లబండ్లపై ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి చేరుకోగానే కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. గురునాధరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో తులసిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, వైసీపీ దుష్టత్రయ పార్టీలని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ మోసగాళ్ల పార్టీని, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీఅని, వైసీపీ అంటే అవకాశవాద సప్త అవలక్షణాల పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం బీజేపీకి అధికారిక మిత్రపక్షమైతే, వైసీపీ అనధికార మిత్రపక్షమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పుడు విభజన చట్టంలో మూడు వరాలు ఈ రాష్ట్రానికి ప్రకటించిందన్నారు. వాటిలో మొట్టమొదటిది ఏపీకి ప్రత్యేక హోదా అని, రెండోది రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అని, మూడో వరం 108 సెక్షన్ల కింద, 13 షెడ్యూల్స్ కింద రూ.5 లక్షల కోట్లు విలువైన ప్రయోజనాలను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మూడో వరంలోనే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం, 11 కేంద్రీయ విద్యాసంస్థలు, విశాఖ రైల్వే జోన్, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, కడప స్టీల్ ఫ్లాంట్, విశాఖ ఇండస్ట్రీయల్ కారిడార్ తదితరమైనవని వివరించారు. మూడు వరాలు అమలైతే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయ్యేదన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ మూడు వరాలు అమలయ్యేవన్నారు. కేంద్రం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఈ నాలుగేళ్లల్లో రాష్ట్రానికి ఎంగిలిమెతుకులే విదిల్చిందని విమర్శించారు. ఈ నాలుగేళ్లల్లో ఈ మూడు వరాలు ఏ మేరకు అమలయ్యాయో పరిశీలిస్తే, ప్రత్యేక హోదా కేంద్రం ముగిసిన అధ్యాయం అని చెప్పడంతో కేంద్రానికి సున్నా మార్కులు పడ్డాయని, రెండో వరం వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి రూ.24,350 కోట్లు ఇవ్వాల్సి ఉందని, దీనిలో కేవలం రూ.1050 కోట్లు మాత్రమే పిల్లికి బిచ్చంవేసినట్టు విదిల్చిందన్నారు. రెండో వరంలో 4 శాతం మార్కులు మాత్రమే పడ్డాయన్నారు. మూడోది రూ.5లక్షల కోట్లు రావాల్సి ఉండగా వచ్చింది కేవలం రూ.11,667 కోట్లు అన్నారు. మూడో వరంలో కేవలం 2 శాతం మార్కులే పడ్డాయన్నారు. ఎక్కడైనా ఐపీ పెట్టినవారే కొంత పర్సంటేజి చెల్లించి చేతులు దులుపుకుంటారని, భారత ప్రభుత్వం ఏపీ విషయంలో ఐపీ పెట్టేస్థితిలో ఉందా? అని ప్రశ్నించారు. వంద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఐపీ టోపీ పెట్టిందన్నారు. నిధులు ఇచ్చేది ఇలా ఉంటే బీజేపీ నేతలు రూ.3.75లక్షల కోట్లు ఇచ్చినట్టు దబాయింపు మొదలు పెట్టారని విమర్శించారు. దీనిలో వాస్తవం లేదని, రాష్ట్రానికి ఎనిమిది మార్గాలలో కేంద్రం నిధులు వస్తాయని, ఈ మార్గాలలో తొలి నాలుగు మార్గాలలో ఇస్తే ఆంధ్రాకు సంబంధించినవని, తరువాత నాలుగు మార్గాలు అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవేనని చెప్పారు. ఈ విషయంలో బొంకుతున్నారని, టీడీపీ - బీజేపీ మేకపోతుల పోట్లాటను తలపిస్తున్నాయని, మేకపోతులు వేగంగా వచ్చి ఢీకొంటాయనుకుంటే దగ్గరకు వచ్చాక ముద్దుపెట్టుకుని తప్పుకుంటాయని చెప్పారు. జగన్ పార్టీ గుంటనక్క పార్టీ అని, ఎప్పుడు బీజేపీ, టీడీపీ బంధం తెగిపోతుందా? తను దూరిపోదామని చూస్తోందని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకాక ముందే జగన్ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించేసిందని, బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతోందని విమర్శించారు. గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఒక్క ఎంపీగాని, ఎమ్మెల్యేగాని లేకపోయినప్పటికీ ప్రజల ప్రక్షాన నిలచి ఎత్తిన కత్తిదించకుండా ప్రత్యేక హోదా కోసం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వంలో పోరాడుతూనే ఉందని, పోరాటాలు వివరించారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ రాష్ట్రంలోని 811 పోలీసు స్టేషన్లలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిపై కేసులు నమోదు చేయించిందన్నారు. ఇక సమయంలేదని, తాడోపేడో, చావోరేవో తేల్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మార్చి 2న జాతీయ రహదార్ల దిగ్బంధం, 6,7 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్ష, 8న పార్లమెంట్ ముట్టడి చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్‌లో మల్లికార్జున్ ఖర్గే 184 సెక్షన్ కింద నోటీసు ఇచ్చారని, మరల నోటీసు ఇస్తారని చెప్పారు. ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, అది ఎన్డీఏ ప్రభుత్వంలోనా? 2019లో వచ్చే యూపీఏ ప్రభుత్వంలోనా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ లోపు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తారని తులసిరెడ్డి స్పష్టం చేసారు.