పశ్చిమగోదావరి

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 23: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాల్గవరోజుకు చేరుకుంది. శుక్రవారం ఏలూరులో కార్మికులు కదంతొక్కారు. జిల్లా నలుమూలల నుండి వందలాదిమంది కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని మహాధర్నా నిర్వహించారు. అనంతరం కార్మికులంతా అర్ధనగ్న ప్రదర్శనగా కలెక్టరేట్ నుండి ప్రదర్శనగా జడ్పీ కార్యాలయం మీదుగా ఫైర్‌స్టేషన్ సెంటరు చేరుకుని అర్ధనగ్నంగా మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున్న నినాదాలు చేయటంతో ఆప్రాంతం అంతా మారుమ్రోగింది. కరెంటు కార్మికుడు కష్టాలను ఏకరువు పెడుతూ కళాకారులు డప్పుదరువులతో అభ్యుదయగీతాలు ఆలపించారు. స్ధానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా శిబిరం కొనసాగింది. ఈ ధర్నాకు సిపిఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎఐటియుసి నాయకులు మద్దతు తెలిపారు. నర్సాపురం, భీమవరం ప్రాంతాల నుండి మోటారుసైకిళ్లపై ర్యాలీగా కార్మికులు ఏలూరు చేరుకున్నారు. ఈసందర్భంగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జిల్లా ఛైర్మన్ హరికృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా నాయకులు పంపన రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ మొండివైఖరి విడనాడి కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు దిగటం ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయలేరని, కార్మికులంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమానపనికి సమానవేతనం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వవైఖరిలో మార్పురాకపోతే ఆందోళన రూపాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మాజీ మంత్రి కొత్తపల్లికి అస్వస్థత
నరసాపురం, ఫిబ్రవరి 23: రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా శ్వాస కోస సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్లవారుజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం కొత్తపల్లిని శుక్రవారం అపోలో ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, పలువురు రాష్ట్ర మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోగ్యంపై ఆరా తీసినట్టు తెలిసింది. కాగా సుబ్బారాయుడు ఆరోగ్యంపై నరసాపురం నియోజకవర్గంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు,