పశ్చిమగోదావరి

అర్హులందరికీ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 23 : అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు అవసరమైన భూమి సేకరణ, లభ్యతపై తక్షణం నివేదిక సమర్పించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో భూమిని సేకరించి ఇళ్లు నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. నియోజకవర్గంలోని 54 గ్రామాలకు ఏయే గ్రామాల్లో భూమి అందుబాటులో ఉన్నది, ఎక్కడ భూమిని సేకరించాల్సి ఉన్నది తనకు నివేదించాలని సూచించారు. ఏలూరు ఆర్డీవో జి చక్రధర్, తహసీల్దార్లు ఇళ్ల డిమాండ్, భూమి లభ్యత, లబ్ధిదారుల వివరాలను మంత్రికి వివరించారు. వేల్పూరు గ్రామంలో నిర్మిస్తున్న జి ప్లస్ టు ఇళ్ల సముదాయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. అన్ని సదుపాయాలతో ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే గ్రామాల్లో ఎంతెంత భూమి అవసరమో, ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఎన్ని ఇళ్లు నిర్మించగలమో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మార్చిలో సీఎం చంద్రబాబు రాక
మార్చి నెలలో సీఎం చంద్రబాబు గూడెంలో పర్యటించనున్నారని, ఆ లోగా అన్ని సిద్ధం చేయాలని మంత్రి మాణిక్యాలరావు అధికారులకు ఆదేశించారు. మాధవరంలో నిర్మిస్తున్న సమగ్ర తాగునీటి పథకాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. త్వరలో తేదీ, సమయం వివరాలు వెల్లడిస్తామన్నారు. పెంటపాడు మండలంలో 2258మంది అర్హత కలిగిన కుటుంబాలు ఉండగా, 800 కుటుంబాలకు జి ప్లస్ టులో ఇళ్లు ఇవ్వొచ్చని ఆర్డీవో చక్రధరరావు తెలిపారు. 1448 మందికి భూమిని సేకరించి ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో 1836మంది అర్హులుండగా, 704 కుటుంబాలకు ఇళ్ళు నిర్మించేందుకు స్థలం అందుబాటులో ఉందన్నారు. 1132 కుటుంబాలకు భూమి సేకరించవలసి ఉందని ఆర్డీవో చక్రధరరావు చెప్పారు.
భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచుతాం
ప్రస్తుతం అనుభవంలో ఉన్న వారికే విమానాశ్రయ భూములను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో చర్చిస్తామన్నారు. జీవో 388 ప్రకారం ఇచ్చిన 120 రోజుల గడువును మరింత పెంపుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో క్రమబద్ధీకరించిన విధంగానే పట్టణంలోనూ పట్టాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుని ప్రస్తుతం ఉన్న అనుభవదారులకు పట్టాలు ఇచ్చేలా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.
మంచినీటి కొరత రానివ్వొద్దు
వేసవి దృష్ట్యా రక్షిత మంచినీటికి ఏ మాత్రం కొరత రానివ్వకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులను మంత్రి మాణిక్యాలరావు ఆదేశించారు. కాగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎం బ్రహ్మాజీని ఆదేశించారు. ప్లాంట్ నిర్మాణ పురోగతిని మంత్రికి వివరించారు. అమృత్ పథకంలో ప్రధాన పైపు లైన్ రీ ప్లేస్ చేస్తున్నామని కమిషనర్ బ్రహ్మాజీ తెలిపారు. విమానాశ్రయం, నిట్ రహదారి దుస్థితిలో ఉందని, దానిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఏలూరు రోడ్డులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.