పశ్చిమగోదావరి

ఇక గృహాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 23: గృహాల జాతరకు రాష్ట్రప్రభుత్వం పూర్తిస్ధాయిలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణం పధకం ఇకనుంచి పరుగులు తీయాలని నిర్దేశించింది. మూఢం, ముహుర్తాలు లేకపోవటం వంటివన్ని దాటిపోగా మంచి ముహుర్తాలు సమీపించిన ఈతరుణంలో గృహనిర్మాణాలకు లబ్దిదారులను పూర్తిస్దాయిలో సంసిద్ధులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి జూన్ నాటికి మూడులక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలో 32వేల గృహాలను ఈవిడతలో నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 26నుంచి మార్చి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ గృహనిర్మాణ శంకుస్ధాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. అవిధంగా ఇప్పుడు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాలను జూన్ కల్లా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నది ప్రధానలక్ష్యంగా కన్పిస్తోంది. ఆమేరకు అన్ని జిల్లాల పరిధిలోనూ లబ్దిదారుల ఎంపిక, కేటాయింపు వంటి సాంకేతిక అంశాలు దాదాపుగా కొలిక్కివచ్చిన పరిస్దితుల్లో వీటిని మరింత వేగవంతం చేసి రానున్న రెండు,మూడురోజుల్లో పూర్తిస్దాయిలో లబ్దిదారుల జాబితాలు, ఎన్టీఆర్ గృహాలు నిర్మించే ప్రాంతాలను అన్నివిధాలుగా ఖరారు చేస్తారు. ఆతర్వాత జిల్లా గృహనిర్మాణసంస్ధ ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో వైభవంగా శంకుస్ధాపన మహోత్సవాలకు రంగం సిద్ధం చేస్తారు. ప్రజాప్రతినిధులు, స్ధానిక నేతల సహకారం, సమన్వయంతో ఈ శంకుస్ధాపన మహోత్సవాలను పండుగ మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికిముందుగానే అయా పరిధుల్లో ఎక్కడెక్కడ లేఆవుట్లు మాదిరిగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నది గుర్తించి ఆ పరిధుల్లో లబ్దిదారులకు ప్రోత్సాహాన్ని అందజేసి ముహుర్తాలు నిర్ణయించుకుని, ఈ మహోత్సవాల్లో శంకుస్ధాపనకు వారిని సిద్ధం చేయటం ప్రధాన కర్తవ్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటికే మంజూరై, కేటాయించిన ఇళ్లకు సంబంధించి మంజూరు పత్రాలను కూడా అదేరోజున అందించేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఈ ఆదేశాల్లో పేర్కొంది. కనీసం లక్ష గృహాలకు సంబంధించి ఈవిధంగా మంజూరు పత్రాలను పంపిణి చేయాలని నిర్దేశించింది. అదేవిధంగా వనం-మనం కార్యక్రమం కింద అయా ప్రాంతాలలో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా వాతావరణం అనుకూలిస్తే చేపట్టాలని నిర్దేశించింది. దీనికి సంబంధించి ముందస్తుగానే కరపత్రాలు, ఇతరత్రా సామాగ్రి ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శంకుస్ధాపన మహోత్సవాలకు అనంతపురంలో 26న శ్రీకారం చుట్టనున్నారు. అదేరోజు నుంచి అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్లేవిధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా అయా ప్రాంతాలలో నిర్వహించిన ఈ మహోత్సవాల ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. ఈవిషయంలో గ్రామ,మండల స్ధాయిల్లో రోజువారీ చేపట్టే కార్యక్రమాల షెడ్యూల్‌ను నిర్ధారించి ప్రభుత్వానికి తెలపాలని కూడా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. జిల్లాస్ధాయిల్లో కూడా ఈ బృందాన్ని ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమన్వయాన్ని సాధించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.