పశ్చిమగోదావరి

రోగులకు ఆధునిక వైద్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 16: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆధునిక వైద్యాన్ని అందిస్తే జీవితాంతం రోగులు డాక్టరును గుర్తుపెట్టుకుంటారని జిల్లా వైద్య విధాన పరిషత్తు కో ఆర్డినేటర్ డాక్టర్ కె శంకరరావు చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం వివిధ విభాగాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని ఇటువంటి స్థితిలో సకాలంలో రోగులకు ఆధునిక వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రతీ నెలా 500 మందికి పైగా గర్భిణీ స్ర్తిలు కాన్పులు కోసం వస్తున్నారని సిబ్బంది కొరత వున్నా డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఆసుపత్రికి మంచి పేరు తీసుకువస్తున్నారని అదే విధంగా అన్ని విభాగాలలో వైద్య బృందాలు ఉత్తమ సేవలు అందించి ఏలూరు ప్రభుత్వాసుపత్రి కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించేలా కష్టపడి ఇష్టంతో పనిచేయాలని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారనే భావన ప్రజల్లో పెరగడంతో ఎన్‌టి ఆర్ వైద్య సేవలు కూడా ఆసుపత్రిలో అమలుచేస్తున్నామని దాని వలన కూడా ఆసుపత్రి పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగిందని ఈ విధానాన్ని కొనసాగించాలంటే మనమంతా సమన్వయంతో కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందుతుందా? లేదా? అని ఆయన స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక వార్డులో ఎర్నియా ఆపరేషన్లు చేయించుకున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ రోగులను కూడా ఆయన పరిశీలించి ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉందని ప్రశ్నించగా డాక్టర్లు మంచి సేవలు అందిస్తున్నారని, రెండు పూటలా భోజనం, రోజూ కోడిగ్రుడ్డు ఇస్తున్నారని రోగులు చెప్పడంతో శంకరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎవి ఆర్ మోహన్ తదితరులు వున్నారు.