పశ్చిమగోదావరి

అధికార, ప్రతిపక్ష నాయకులకు నిద్ర కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, మార్చి 18: అధికార, ప్రతిపక్ష నాయకులకు నిద్ర కరవవుతుందని, పలువురు అధికారులు, రాజకీయ నేతలు అపఖ్యాతి పాలవుతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు గోపావజ్జుల మాధవశర్మ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విళంబి నామ సంవత్సర ఉగాది సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవశర్మ పంచాంగ శ్రవణం గావించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు బాగావస్తాయని, సైబర్ నేరాలు బాగా పెరుగుతాయని, మెట్రో మెగాసిటీల్లో అకస్మాతుగా వర్షాలు వస్తాయని, కుంభకోణాలు భారీగా బయట పడతాయని జ్యోతిష్య పండితులు మాధవశర్మ తెలిపారు. ముఖ్య మంత్రులకు ఇబ్బందులు తలెత్తుతాయని, సరిహద్దు యుద్ధాలు జరుగుతాయని, రెండు భూకంపాలు వస్తాయని తెలిపారు. సూర్యనారాయణస్వామి ఈ ఏడాదికి అధిష్టాన దేవత కాబట్టి ఆయనను నిత్యం ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయని మాధవశర్మ తెలిపారు. ఈ సందర్భంగా మాధవశర్మతోపాటు నాటకరంగ కళాకారుడు వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకా పద్మకుమారి, ఏఎంసీ ఛైర్మన్ ఉప్పలపాటి సురేష్‌బాబు, జడ్పీటీసీ సభ్యుడు బండి రామారావు, వైస్ ఎంపీపీ గెద్దాడ సన్యాసిరావు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఆచంటలోని శ్రీరామేశ్వరస్వామి దేవాలయంలో గోపావజ్జుల మాధవశర్మ, కొడమంచిలి శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రముఖ పండితులు మానేపల్లి రామలింగశర్మల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఆచంట వేమవరం, కొడమంచిలిలోని శ్రీ సోమేశ్వరస్వామి, సర్వేశ్వరస్వామి దేవాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు.

ప్రత్యేక హోదా కోసం మోటారుసైకిల్ ర్యాలీ
భీమడోలు, మార్చి 18 : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు పేర నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఆదివారం మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భీమడోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వందలాదిగా మోటారు సైకిళ్లతో ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ర్యాలీకి నాయకత్వం వహించి ముందుకు నడిచారు. ర్యాలీ భీమడోలు, కురెళ్లగూడెం, పూళ్ల మీదుగా ముగింపు వేదిక అయిన గణపవరం తరలి వెళ్లింది. కార్యక్రమంలో టిడిపి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.