పశ్చిమగోదావరి

ఘనంగా ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 18: శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచి వెంకట సుబ్రహ్మణ్యం, ఆలయ వేద పండిడతులు ఈవని రామచంద్రసోమయాజులు ఘనాపాఠిలు పంచాంగ శ్రవణం చేశారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉగాది వేడుకలు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి పార్ధసారధివర్మ ఆద్వర్యంలో నిర్వహించారు. ఉగాది లక్ష్మికి విద్యార్థులు జ్యోతి ప్రజ్వళన చేసి ఆమెకు నమస్కరించారు. ఈ సందర్భంగా మంతెన రామచంద్రరాజు, కృష్ణహరి, డిఎస్‌ఎన్ రాజు, డాక్టర్ కెవిఎస్‌ఎన్ రాజులు మాట్లాడారు. సీతారామరాజు ఆద్వర్యంలో శాస్త్రోకంగా ఉగాది పచ్చడి తయారుచేసి అందరికీ అందించారు. నాలుగో తరగతి సిబ్బందిని ప్రిన్సిపల్ డాక్టర్ జి పార్ధసారధివర్మ సత్కారావు పాదపూజను విద్యార్థుల చేత చేయించారు. భీమవరం మాజీ శాసనసభ్యులు, వైసీపీ కో ఆర్డినేటర్ గ్రంధి శ్రీనివాస్‌ను ఉగాది సందర్భంగా ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్‌కు వారు విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా, నిరుద్యోగులకు ఉపాధి కలగాలని తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వైభవంగా స్ధానిక భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఉగాది వేడుకలను నిర్వహించింది. తహసీల్దార్ చవ్వాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. విజ్ఞాన వేదిక ఆద్వర్యంలో ఉగాది పురస్కారాలను రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అందించారు. యర్రా నారాయణస్వామి, యిర్రింకి సూర్యారావు, మెంటే పార్ధసారధి, మెంటే గోపి, కంతేటి వెంకటరాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య తదితరులు విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయిని అభినందించారు. ఉగాది వేడుకలకు ముందుగా శోభాయాత్ర చేశారు.
ఆకివీడు: ఉగాది వేడుకలు ఆకివీడులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాంతి కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురికి ఎమ్మెల్యే శివరామరాజు చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వైవిఎస్‌టి సాయి, సతీష్‌చందర్, ఎమ్మెల్సీ షరీఫ్, సినీ దర్శకులు రాజా వనె్నంరెడ్డి, విరించి వర్మ, ప్రాసమణిలకు 2018 జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులకు ప్రతిభా పురస్కార అవార్డులను అందజేశారు. జిల్లా వినియోగదారుల సంఘ అధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య దంపతులను సన్మానించి ఉత్తమ అధికారి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీపీ నౌకట్ల రామారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మద్దిలో పంచాగ శ్రవణం
జంగారెడ్డిగూడెం: విళంబి నామ ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఆదివారం పంచాగ శ్రవణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పంచాగ శ్రవణం చేసి భక్తులకు వినిపించారు. విశేష సంఖ్యలోభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాగ శ్రవణాన్ని విన్నారు. ఈ సందర్భంగా మద్ది ఆలయ పంచాంగాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే గర్భగుడిలో కొలువై ఉన్న మూలవిరాట్ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వార్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిఎస్పీ సీహెచ్ మురళీ కృష్ణ, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెనె్మత్స విశ్వనాధరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.