పశ్చిమగోదావరి

బిషప్‌ను మార్పు చేయాలని ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 21 : ఏలూరు కథోలిక పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు దుశ్చర్యలు, అక్రమాలు రోజురోజుకూ అధికమయ్యాయని, ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ ఆర్‌సి ఎం పరిరక్షణ సమితి ఏలూరు శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పరిరక్షణ సమితి నాయకులు కలెక్టరేట్‌లో అందజేశారు. ధర్నానుద్దేశించి పరిరక్షణ సమితి నాయకులు పి జాన్ కెనడీ, జెవివి సాగర్, తోట శ్యామ్, తోట రవికుమార్, రెడ్ల ఆంజిలో, కె రామారావు, అబ్బూరి అనిల్, పి ఆదాం, దాసరి పురుషోత్తంలు మాట్లాడుతూ బిషప్ జయరావు చేసిన అక్రమ బలవంతపు మత చట్ట విరుద్ధ బదలీల వలన చింతలపూడి ఆంథోనీ నగర్ ఫాదర్ చేబత్తిన ఆంథోని, అన్నదేవరపేట ఫాదర్ బి రత్నంరాజులు అకాల మరణాలు పొందారన్నారు. ఫాదర్ విల్సన్‌పై జీలకర్రగూడెంలో ఇటీవల నాలుగుసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయని, బిషప్ తన కులస్తుల చేత కథోలికేతరుల చేత తన కుల గురువుల చేత తన సమక్షంలోనే మా సంఘస్తులను కొట్టించి అనేక రకాలుగా పరాభవించడం జరిగిందన్నారు. అనేక మందికి బెదిరింపులు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. బిషప్ తన మతాధికార, ధన, రాజకీయ, కుల బలాన్ని ఉపయోగించి న్యాయాన్ని కోరె విశ్వాసులను వివిధ విచారణల ప్రజలను అణచివేస్తున్నారన్నారు. న్యాయాన్ని ప్రశ్నించిన గురువులను, పాఠశాల కరస్పాండెంట్లను కూడా తొలగించడం జరిగిందన్నారు. ఇన్ని అన్యాయాలను కొనసాగిస్తూ మనోభావాలను, మత విశ్వాసాలను కాలరాస్తున్న బిషప్ పూజ చేయు నైతిక అర్హత కోల్పోయారన్నారు. తమకు గల కేనన్ లా ప్రకారం ప్రశ్నించుచూ నిలువరించుచున్న నేపధ్యంలో బిషప్ తనకు గల పలుకుబడితో మతాధికారుల నుంచి ఏకపక్షంగా తెచ్చుకున్న అనుమతి సాకుగా చూపి గురువారం ఏలూరు కథీడ్రల్‌లో పూజ చేసి గురువుల చేత బలవంతంగా బేషరతు విధేయత, ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయించడం, అట్లు చేయని గురువులపై అక్రమ చర్యలకు, అణచివేతకు ఒడిగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏ సమస్యలు పరిష్కరించకుండా రెండున్నర సంవత్సరాలుగా కథీడ్రల్‌లో పూజ చేయని బిషప్ ఇప్పుడు దానికి పూనుకోవడం సరికాదన్నారు. తాము ఎపి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌కు విన్నవించుకోగా ఉద్రిక్తతలు, కుల వైషమ్యాలు నివారించడానికి కథీడ్రల్‌లో బిషప్ జరుపు కార్యక్రమం సముచితం కాదని, నిలువరించమని ఉత్తర్వులు కూడా జారీ చేశామన్నారు. ఎపి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఉత్తర్వులను అమలు పర్చుటకు తగిన చర్యలు తీసుకుని తమ మతపరమైన హక్కులను, పౌర హక్కులను పరిరక్షించుచూ తమకు గల సంఘ సభ్యులకు బాధిత గురువులకు, విశ్వాసులకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత బిషప్ హౌస్ నుంచి జెండాలు, బేనర్లతో జయరావును బదిలీ చేయాలని నినాదాలుచేస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు.

జనసేన ఆధ్వర్యంలో రాస్తారోకో
ఏలూరు, మార్చి 21 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆందోళన నిర్వహించి రాస్తారోకో జరిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు జల్లా హరికృష్ణ, పి సాగర్‌బాబు, మారిశెట్టి పవన్ బాలాజీ, నారా శేషు, కోట పవన్, కాట్నం విశాలి, తూము విజయకృష్ణ, మత్తే బాబి, పోలవరం వినోధ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మోడల్ ఇళ్లను పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్
భీమవరం, మార్చి 21: పట్టణం శివారులోని 82 ఎకరాల్లో ఎన్టీఆర్ కాలనీ పేరుతో నిర్మితమవుతోన్న హౌసింగ్ ఫర్ ఆల్ జి+3 గృహ నిర్మాణాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావుతో కలిసి అసిస్టెంట్ కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. ఎల్‌అండ్‌టి సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న నేపధ్యంలో ఆ ఇంటి నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆయన పరిశీలించారు. అదే విధంగా మోడల్ గృహాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్సింహారావు మాట్లాడుతూ ముందుగా లబ్ధిదారులను అర్హత ఆధారంగా ఎంపిక చేసినట్టు వివరించారు. అర్హులైన లబ్ధిదారుల చేత డిడిలు చెల్లింపులు చేయించడం జరిగిందని, వారికి ఎంత మేర గృహానికి ఖర్చు అవుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వారికి ఆర్ధికంగా సహాయంగా నిలుస్తాయో వివరించినట్టు చేతన్‌కు చెప్పారు. అదే విధంగా బ్యాంకుల రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చాయని, త్వరలో అన్ని గృహాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ సొంత ఇంటి కలను నెరవేరుస్తామన్నారు.