పశ్చిమగోదావరి

ఇదెక్కడి దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 21: జిల్లాపరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహజంగానే కొంత దూకుడు స్వభావమే అయినప్పటికీ గత నాలుగేళ్లలోనూ లేనిస్ధాయిలో బుధవారం జరిగిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారయంత్రాంగం తీరుపై తీవ్రస్దాయిలో విరుచుకుపడ్డారు. దాదాపుగా అధికారులకు ముచ్చెమటలు పట్టించారనే చెప్పాలి. పరిపాలన సాగుతున్న తీరుపై పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే తప్ప పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించి ఎక్కడైనా తేడా జరిగితే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినా దానిని పట్టించుకోకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని, ఈవిషయంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పరుషపదజాలాన్ని కూడా వాడేశారు. అంతేకాకుండా దాదాపుగా అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఉల్లంఘన జరిగింది అన్న అంశాలను పేర్కొంటూ ఒకరకంగా చెడుగుడు అడేశారనే చెప్పాలి. ఈపరిణామాలను చూసి అధికారులంతా కక్కలేక,మింగలేక మిన్నకుండిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దామని ప్రయత్నించానని, అయితే ఇప్పుడున్న పరిస్దితులు చూస్తుంటే తీవ్ర అసంతృప్తి మాత్రమే కాకుండా అసలు రాజకీయాలే మానుకోవాలన్న ఉద్దేశ్యం కూడా వస్తోందన్నారు. అయితే తాను బరి వదిలి పారిపోయే మనిషిని కాదని, ఈ ఏడాది ఇక ఉపేక్షించేది లేదని, ఇకనుంచి యుద్ధమే మొదలుపెడతామని హెచ్చరించారు. ఎక్కడాలేని రీతిలో జిల్లాలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తే దానికోసం జిల్లాకు మంచి జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ఎంతోమంది ముందుకొచ్చి కాంట్రాక్టర్లుగా నిలిచారని, అయితే అసలు లక్ష్యాన్ని నీరుగార్చేవిధంగా కనీసం వాటికి సోషల్ ఆడిట్ కూడా పూర్తిచేయకుండా 30కోట్ల రూపాయల బిల్లులను నిలిపివేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మాపై నమ్మకంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు(కార్యకర్తలు) బిల్లులు అందక వడ్డీలపై వడ్డీలు కడుతూ నష్టపోతున్నారని, ఈపరిణామాల వల్ల చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికే నష్టం జరిగే పరిస్దితిని తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు సోషల్ ఆడిట్, నాణ్యతా తనిఖీలను పనులు పూర్తిచేసిన సంవత్సరకాలంలో పూర్తి చేసి పెండింగ్‌లో ఉంచిన బిల్లులు చెల్లించాల్సి ఉందని, అయినప్పటికీ ఆపరిస్ధితి ఇక్కడ కన్పించటం లేదని ధ్వజమెత్తారు.
జిల్లాలో పాలన ఎలా జరుగుతోందంటే అని పేర్కొంటూ ఉదాహరణగా జిల్లా స్ధాయి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని కోటి రూపాయల నిధులు ప్రభుత్వం అందించిందని, వాటిని ఏం చేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు. నల్లజర్ల పరిధిలో తాను ఆరులక్షల రూపాయల వ్యయంతో ఈ సంబరాలను నిర్వహిస్తే రూ. 50వేలు ఇచ్చారని, అవికూడా ఎందుకని తిరిగి పంపించివేశానని చెప్పారు. ఇలాంటి పరిస్దితులు సాగుతుంటే ఇక ప్రజలకు అభివృద్ధి కన్పించేది ఎప్పుడని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల చరిత్రలో ఇంత పెద్ద అభివృద్ధి ఎప్పుడైనా చేశారా, అధికారులు చూశారా అంటూ బాపిరాజు ప్రశ్నించారు. జిల్లాలో 1800కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశామని, ఇది ఒకరకంగా రికార్డు అయినప్పటికీ వాటి బిల్లులు మాత్రం చెల్లించకుండా కాంట్రాక్టర్లను నలిపివేస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం జడ్పీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా ఏ అధికారి సక్రమంగా స్పందించటం లేదని, ఒకవైపు చేపట్టిన పనులు సకాలంలో జరగక, బిల్లులు రాక, మరోప్రక్క పూర్తయిన బిల్లులకు చెల్లింపులు లేక సర్పంచ్‌లు, పనులు చేసిన కార్యకర్తలు నలిగిపోతున్నారన్నారు. వారంతా నిరాశ,నిస్పృహల్లో కూరుకుపోతున్నారని, దీనివల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్దితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పదిమంది జడ్పీటీసీ సభ్యులు కలిసి ప్రస్తుత పరిస్దితుల్లో రాజకీయాల్లో ఎందుకు ఉన్నామో తెలియటం లేదని, సిగ్గు పడుతున్నామంటూ వ్యాఖ్యానించారని, దీనినిబట్టి పరిస్దితులు ఎంత దిగజారేయో అర్ధం చేసుకోవచ్చునన్నారు. జిల్లా ఉన్నతాధికారి వారంవారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే ఉరుకులుపరుగులు మీద హాజరయ్యే అధికారులు జడ్పీ సమావేశాలకు మాత్రం ఆస్దాయిలో ఆసక్తి చూపకపోవటం ఏమిటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆత్మపరిశీలన చేసుకుని పనిచేస్తే కేంద్రం సహకారం లేకుండానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లవచ్చునన్నారు. ఈనాలుగేళ్లు పరిపాలనలో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురుచూశామని, ఇక సహనం చచ్చిపోయిందని, ఇకపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. జిల్లాలో ఇసుక రవాణాలో దళారులదే పైచెయ్యిగా మారిపోయిందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, అధికారులు, రాజకీయనాయకులు తప్పుచేస్తుంటే ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రిని నిందిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.