పశ్చిమగోదావరి

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 21 : జిల్లాలో రెవిన్యూ ఉద్యోగులు అంకితభావంతో సేవలు అందించి జిల్లా యంత్రాంగానికి మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావులు కోరారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు బుధవారం రాత్రి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా పాలనలో రెవిన్యూది కీలకపాత్ర అని, ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతూ అటు ప్రభుత్వానికి, ఇటు జిల్లా యంత్రాంగానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భాస్కర్ రెవిన్యూ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

నెలాఖరులోగా హామీ అమలు చేయకపోతే
టీడీపీని భూస్థాపితం చేస్తాం
కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి హెచ్చరిక
ద్వారకాతిరుమల, మార్చి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని ఈ నెలాఖరులోగా అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తామని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు హెచ్చరించారు. ద్వారకాతిరుమలలోని కాపు కళ్యాణ మండపంలో బుధవారం సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో చినిమిల్లి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లను తక్షణం అమలు చేయడంపై ప్రభుత్వంపై ఏవిధంగా వత్తిడి తేవాలన్న అంశంపై ఈ నెల 27న జరగనున్న కార్యకర్తల విస్తృత సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్లతోపాటు ఏడాదికి రూ.వెయ్యి కోట్ల సంక్షేమ నిధిని కేటాయిస్తామని హామీ ఇచ్చి దానిని తుంగలో తొక్కి కుంటుసాకులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గత మూడేళ్లుగా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారని, అయితే దానిని ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన అన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి ముద్రగడ లేఖ రాశారని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని చినిమిల్లి పేర్కొన్నారు.