పశ్చిమగోదావరి

కొనాయికోడు తవ్వకాలను అడ్డుకున్న బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, మార్చి 22: మొగల్తూరు గ్రామంలో పాలకొల్లు డ్రెయినేజీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనాయికోడు మైనర్ డ్రెయిన్ తవ్వకపు పనులను గురువారం డ్రెయిన్ గట్టుబాధితులు సీపీఎం పార్టీ నాయకులు యడ్లచిట్టిబాబు వీరాపాండులు ఆధ్వర్యంలో అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. మొగల్తూరులో కొనాయికోడ్ గట్టుపై నివశిస్తున్న కుటుంబాలు వారికి న్యాయం జరిగేంత వరకు తవ్వకాలు జరపరాదని వారు అడ్డుకుని డ్రెయినేజీ , రెవెన్యూశాఖ అధికారులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేసి పొక్లెయినర్ సహాయంతో జరుగుతున్న తవ్వక పనులును వారు సామూహికంగా కలసి నిలిపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొగల్తూరు నాగదేవత ఆలయంలో గల ప్రభుత్వ ఇంటిస్థలాలు కాలనీలో పట్టాలు ఇచ్చి స్థలం చూపించిన అనంతరం తవ్వకాలు జరుపుకోవాలనీ వారు నిరసన ద్వారా మొరపెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పాలకొల్లు డ్రెయినేజీ శాఖ ఈఈ.శ్రీనివాస్ రావు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. సమస్య పరిష్కరం కాకపోవటంతో అక్కడ నుండే బాధితులు తరుపున సీపీఎం నాయకులు యడ్ల చిట్టిబాబు స్థానిక సబ్‌కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి ఫోను ద్వారా సమస్య విన్నపించగా మండల తహసీల్దారు హరినాధ్‌ను సంఘటనా స్థలానికి పంపించారు. అయితే కోడ్ తవ్వకంపై లోకయుక్త కోర్టు ఆదేశాలు మేరకు తవ్వకాలు జరపాలని తవ్వకాలు నిలుపుదల చేయటం తగదని డ్రెయినేజీ డీఈ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ హరినాథ్ ఆందోళన కారులకు నచ్చ చెప్పటంతో బాధితులు మాత్రం ఆగ్రహనికి గురై తమకు తక్షణం స్థలాలు ప్రత్యామ్నాయంగా చూపించితే తాము ఇక్కడ నుండి ఖాళీ చేయటం జరుగుతుందని చెప్పారు. పోద్దు పోవడంతో శుక్రవారం ఉదయం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పటంతో కొనాయి కోడ్ బాధితులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. దీంతొ కోడ్ సమస్య శుక్రవారం నకు వాయిదా పడటంతో బాదితులు శాంతింపజేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
అంతర్జాతీయ దివ్యాంగుల టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా నాగేంద్రసింగ్ ఎంపిక
ఏలూరు, మార్చి 22: అంతర్జాతీయ స్ధాయిలో మొట్టమొదటిసారిగా భారత్, ఆప్ఘనిస్ధాన్ దేశాల మధ్య జరిగే క్రికెట్ టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా ఏలూరుకు చెందిన దివ్యాంగ ఉపాధ్యాయులు నాగేంద్రసింగ్ ఎంపికయ్యారు. ఈనెల 26వ తేదీ నుండి చండీఘడ్‌లో జరగనున్న ఈ మొట్టమొదటి దివ్యాంగుల క్రికెట్ టెస్టుమ్యాచ్‌కు అంపైర్‌గా ఎంపిక కావటం పట్ల నాగేంద్రసింగ్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరాంనగర్ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సింగ్ గతంలో అనేక టి-20 మ్యాచ్‌లలో అంపైరింగ్ చేశారు.