పశ్చిమగోదావరి

భీమవరంలో ఎన్‌హెచ్ 165 దగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 22: రాజకీయకేంద్రమైన భీమవరంలోని అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రత్యేక హోదా ఐక్య కార్యాచరణ కమిటీ కూడా హోదా సాధన కోసం ఆందోళన బాట పట్టింది. ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రహదారి 165ని దిగ్బంధం చేసింది. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గ్రంధి శ్రీనివాస్, పార్టీ క్యాడర్‌తో పాటు ఆయన జాతీయ రహదారి 165ని దిగ్బంధం చేశారు. గంటల తరబడి చేసిన ఈ దిగ్బంధానికి పట్టణంలోని ప్రజలు కూడా ఈ ఆందోళనలో స్వచ్చందంగా పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం పరధిలోని భీమవరం మండలం, వీరవాసరం మండలం, భీమవరం పట్టణ అధ్యక్షులు, పార్టీ అనుబంధంగా ఉన్న విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక హోదా ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కన్వీనర్ వడ్డి సుబ్బారావు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల సాయిబాబాలు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలతో వినూత్న నిరసన తెలిపారు. కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ, సయ్యద్‌బేగం, ఇందుకూరి శివాజీవర్మ, కొట్టి సత్యనారాయణ, విజ్జురోతి రాఘవులు, కంభంపాటి బాబ్జి, శివకవి సాంబమూర్తి, నల్లం గంగాధర్, పట్టెం శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలోని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శిలు తోట భోగయ్య, ఉప్పులూరి చంద్రశేర్ ఆద్వర్యంలో శాంతియుతంగ ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేశారు. జాతీయ రహదారి 165పై నిరశన తెలిపారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను మోసం చేశారన్నారు. సీనియర్ నాయకులు, మాజీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మాట్లాడుతూ తెలుగుప్రజలు ప్రదాని పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నీ ఆడియాశలు చేశారన్నారు.

పోలీసు రక్షణలో దివ్యబలిపూజ నిర్వహణ
- బిషప్ హౌస్ వద్ద ఉద్రిక్తత
ఏలూరు, మార్చి 22: స్ధానిక గ్జేవియర్ నగర్‌లోని బిషప్ హౌస్ సమీపంలోని అమలోద్భవ మాత మహాదేవాలయంలో గురువారం పోలీసు రక్షణలో బిషప్ పొలిమేర జయరావు దివ్యబలిపూజను నిర్వహించారు. కొద్దిరోజులుగా జయరావు, ఆర్‌సిఎం పరిరక్షణా కమిటీ సభ్యుల నడుమ చిన్నపాటి ఘర్షణలు కొనసాగుతూ వస్తున్నాయి. జయరావు అకృత్యాలు ఎక్కువయ్యాయని పరిరక్షణా కమిటీ సభ్యులు ఆరోపిస్తూ ఆయనను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ ఆందోళనా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గురువారం జరిగే దివ్యబలిపూజకు ఎటువంటి అటంకాలు ఏర్పడకుండా భారీసంఖ్యలో మోహరించారు. దీంతో బిషప్ హౌస్ వద్ద గురువారం కూడా ఉద్రిక్తపరిస్ధితులు నెలకొన్నాయి. పరిరక్షణా కమిటీ సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు దాన్ని నియంత్రించారు. ఈనేపధ్యంలోనే బిషప్ జయరావు వర్గం, పరిరక్షణా కమిటీ సభ్యుల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా బిషప్ జయరావు మాట్లాడుతూ తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన జయరావు ఆ స్ధానంలో ఉండకూడదని మరో వర్గం డిమాండ్ చేస్తూ ఆయనను బదిలీ చేయాలని గత కొద్దికాలంగా ఆందోళన చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు గురువారం దివ్యబలిపూజ సజావుగా జరిగింది. ఏలూరు డిఎస్పీ కె ఈశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు సిఐలు, ఎస్సైలు, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.