పశ్చిమగోదావరి

శిక్షణకు సింగపూర్‌కు కలెక్టరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 22: పరిపాలనలో ఉత్తమ ప్రమాణాలను తీసుకువచ్చే లక్ష్యంతో సింగపూర్‌లో ఏషియన్ కాంపిటిటీవ్‌నెస్ సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణకు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఎంపికయ్యారు. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు సింగపూర్‌లో జరగనున్న ఈ శిక్షణా కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఇంతకుముందు జిల్లాలో పనిచేసి ప్రస్తుతం సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా ఉన్న షణ్మోహన్ కూడా హాజరుకానున్నారు. రాష్టవ్య్రాప్తంగా పలువురు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ఈ శిక్షణకు ఎంపికయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.