పశ్చిమగోదావరి

జాతీయ రహదారి దగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలుచేయాలని, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని ఖండిస్తూ రాష్టవ్య్రాప్త పిలుపులోభాగంగా ఏలూరుకు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమై గళం విప్పాయి. ఉదయం 10గంటల నుంచి రహదారిని దిగ్బంధించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన, ప్రజాసంఘాలు, విద్యార్ధిసంఘాల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జాతీయరహదారిపైకి చేరుకున్నారు. కొంతమంది యువకులు అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపి డౌన్‌డౌన్, టిడిపి, బిజెపి డ్రామాలు అపాలని, ఆంధ్రప్రదేశ్ ద్రోహి మోదీ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా దుర్మార్గంగా బిజెపి వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు హోదా ఇస్తామని చెప్పి బిజెపి, తెలుగుదేశం పార్టీలు హామీ ఇచ్చి ప్రజలను నాలుగేళ్లు మోసం చేశాయన్నారు. జాతీయ రహదారుల దిగ్బంధనంతో అయిన బిజెపికి కనువిప్పు కావాలని, తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైకాపా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం నాడు ప్యాకేజీకి ఒప్పుకుని తప్పుచేసిందని, తిరిగి నేడు మరల హోదా నినాదం ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి తొలినుంచి హోదా కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. హోదా కోసం వైకాపా ఎందాకైనా పోరాడుతుందన్నారు. జనసేన జిల్లా నాయకులు పి సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు మాట్లాడుతూ హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాడుతామని పేర్కొన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు హోదా విషయంలో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. వివిధ ప్రజాసంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం దిగివచ్చేంతవరకు పోరాడతామని ప్రకటించారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆటలాడవద్దని, ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారుల దిగ్బంధనంలో పాల్గొన్న జిల్లా ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు ఆర్‌ఎహ్ హరినాధ్, కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్‌లు తమ మద్దతు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులందరూ హోదా కోసం నాన్ పొలిటికల్ జెఎసి తరపున ఉద్యమిస్తున్నట్లు వారు తెలిపారు. హోదా ఉద్యమంలో ఉద్యోగులందరూ ప్రజలందరితో కలిసి ముందుంటామని ప్రకటించారు.