పశ్చిమగోదావరి

ఒక్క రైతూ ఫిర్యాదు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 22: పోలవరం భూసేకరణ విషయంలో వివక్ష చోటుచేసుకుందని ఒక్క రైతు కూడా తనవద్దకు రాలేదని, అందరికి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఈవిషయంలో చట్టపరిధిలోని వ్యవహరించామని, అదిదాటి ఒక్క అడుగు కూడా వేయలేదని, ఒక్క పైసా తప్పు కూడా జరగలేదని ఆయన వివరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాలకు చెందిన రైతులు కలెక్టరును కలిసి తమ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో భూసేకరణ చేస్తే ఏళ్ల తరబడి పరిహారం వచ్చేది కాదని, కానీ దళారీలతో సంబంధం లేకుండా నేరుగా రైతులతో చర్చించి తమ భూములకు పరిహారాన్ని వెంటనే తమ బ్యాంకు ఖాతాలో వేయటం వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఏటా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ రావటం వల్లే తమ భూములకు ఊహించని ధర లభించిందని చెప్పారు. ఏజన్సీలో గిరిజన, గిరిజనేతరులందరికి రాజకీయాలకు అతీతంగా అందరి భూములు సేకరించారని, దీనివల్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల తాము మనస్తాపం చెంది సంఘీభావం తెలపాలన్న ఉద్దేశ్యంతో కలెక్టరును కలుసుకున్నట్లు చెప్పారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామానికి చెందిన పెద్ది లీలాప్రసాద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరుకు తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు. కలెక్టరు నీతి,నిజాయితీలతో సమర్ధంగా పనిచేయటం వల్లే తమకు న్యాయమైన ధర లభించి అనందంగా ఉన్నామని బుట్టాయిగూడెంనకు చెందిన గద్దే సత్యనారాయణ చెప్పారు. కొంతమంది అల్లరి వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందనే భావన కల్పించి అధికారులను భయబ్రాంతులకు గురి అయ్యేలా చేస్తున్నారని, ఇటువంటి కుట్రలను తాము సహించేది లేదని, అవసరమైతే ఈవిషయంలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని ముప్పినవారిగూడెంనకు చెందిన కాకర్ల వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరు భాస్కర్ చూపిన చొరవ వల్లే తమకు సకాలంలో భూపరిహారం లభించిందని, తామంతా సంతోషంగా జీవించగలుగుతున్నామని పాములవారిగూడెంనకు చెందిన వెంట్రప్రగడ నారాయణరావు, బిక్కిన వెంకటరమణ పేర్కొన్నారు. పరిహారం లభించటంలో ఏ రైతు ఒకరికి కూడా రూపాయి కూడా ఇవ్వలేదని, దేశచరిత్రలో ఒక ప్రాజెక్టుకు ఇంత త్వరగా భూములను సేకరించగలిగే దమ్ము, ధైర్యం ఉన్న కలెక్టరు భాస్కర్ మాత్రమేనని చెప్పారు. నీతి,నిజాయితీలతో పనిచేసేవారిపై బురదజల్లితే రైతులుగా తాము సహించేది లేదని, ఎంతవరకైనా వెళతామని దొరమామిడి గ్రామానికి చెందిన పోలిన సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. భూసేకరణతోపాటు పునరావాసంలోనూ డాక్టరు భాస్కర్ చూపుతున్న చొరవ, కృషి ఫలితంగా భవిష్యత్‌లో రైతాంగం జీవనస్ధితిగతులు కూడా ఎంతో మారనున్నాయని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరాటం భూపాల్ చెప్పారు. వీటిపై కలెక్టరు భాస్కర్ స్పందిస్తూ చట్టప్రకారం రైతులకు పరిహారం అందించామని, ఎక్కడా చట్టపరిధి దాటి వ్యవహరించలేదని, ఒక్కపైసా తప్పు జరగలేదని, ఈవిషయంలో ఎవరికి భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇంతవరకు భూసేకరణలో తమకు అన్యాయం జరిగిందని, వివక్ష చూపారని ఏ ఒక్క రైతు తన వద్దకు రాలేదని చెప్పారు. అధికారిగా నిజాయితీగా వ్యవహరించటమే తన ఉద్దేశ్యమని చెప్పారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టపరిధిలో పనిచేసే వ్యవస్ధను నిర్వీర్యం చేసేలా ఎవరూ వ్యవహరించకూడదని, తన హక్కులకు భంగం కలిగేలా ఎవరు వ్యవహరించినా చట్టప్రకారం చర్యలుంటాయని, రైతులకు తనకు సంఘీభావంగా ముందుకు రావటం అభినందనీయమని చెప్పారు.