పశ్చిమగోదావరి

మంచినీటి చెరువులు నింపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 24 : జిల్లాలో పది రోజులు ఆలశ్యం అయినా నూరుశాతం మంచినీటి చెరువులను నింపిన తర్వాతే పంటకాల్వలను మూసివేయడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మాణం, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ పంటకు అవసరమైన సాగునీటిని పూర్తిస్థాయిలో అందించి జిల్లాలోని అన్ని గ్రామాలలో మంచినీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపే వరకూ కాల్వలకు నీరు అందిస్తామని చెప్పారు. ప్రతీ పంచాయితీతోపాటు అన్ని పురపాలక సంఘాల్లో కూడా తాగునీటి నిల్వలు నూరుశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే తాగునీటికోసం ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది తలెత్తకూడదని అందరికీ తాగునీరు అందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లాలో అన్ని తాగునీటి చెరువులకు, మంచినీటి పధకాలకు నీరు నింపుకునే వరకూ కాల్వలు మూసివేయడం జరగదని ఇదే సమయంలో రబీ పంట నీటి అవసరాలు తీరే వరకూ కాల్వలుతెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళనా చెందనవసరం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టరు సమీక్షిస్తూ జూన్‌లో నీరందించేలా చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లిప్తత విడనాడి పనులు చురుకుగా సాగేలా జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకంకు సంబంధించిన డిజైన్ల విషయంపై ఇప్పటికే పలుమార్లు సంబంధితాధికారులతో మాట్లాడి ఉంటానని అయినప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతున్నదని జల వనరుల శాఖాదికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి సమాచారం అందుబాటులో ఉండడంతోపాటు ఎక్కువ రీ డిజైనే్ల ఆమోదం పొందవలసి వుందని అయినప్పటికీ డిజైన్ల ఆమోదంలో తీవ్ర జాప్యం జరగడం తగదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 277 డిజైన్లు ఆమోదం పొందవలసి వుండగా వాటిలో 160 డిజైన్లు సమర్పించగా 130 ఆమోదం పొందాయన్నారు. అయితే ఇంకా 111 డిజైన్లు అప్రూవల్ కావాల్సి వుందని వీటన్నింటినీ రానున్న నాలుగు వారాల్లో సంబంధిత అధికారుల స్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో ఆమోదం పొందాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకంకు సంబంధంచి భూసేకరణ కింద రైతులకు చెల్లించవలసిన పరిహారం, అటవీ శాఖకు, ట్రాన్స్‌కోకు చెల్లించవలసిన సొమ్ము వివరాలను అందజేయాలని సంబంధితాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోణంగి పుంత పనులను 15 రోజుల్లో పూర్తిచేయాలని జల వనరుల శాఖాధికారులను ఆదేశిస్తూ ఈ పనులు పూర్తి చేయించడంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఏలూరు ఆర్డీవో జి చక్రధరరావును ఆదేశించారు. ఆంధ్రాకాల్వకు సంబంధించిన ఫైల్స్ గత మూడు నెలలుగా అపరిష్కృతంగా ఉన్నాయని వెంటనే సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపేందుకు చర్యలు తీసుకోవాలని జలనవరుల శాఖ ఎస్ ఇ రఘునాధ్‌ను ఆదేశించారు. పోగొండ రిజర్వాయరును ప్రారంభించుకున్న దృష్ట్యా ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న పనులు ఉంటే యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసిఖరీఫ్‌కు పూర్తిస్థాయి నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివిధ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ చేసి జల వనరుల శాఖకు అప్పగించిన తర్వాత దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ శాఖదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డెల్టా ఆధునీకరణ, నల్లిగ్రిగ్, వియర్ ఛానల్, నక్కల డ్రైన్‌లకు సంబంధించిన పనులు ప్రగతి తీరుపై కలెక్టర్ జల వనరుల శాఖాధికారులతో సమీంచారు. జాతీయ రహదారుల నిర్మాణంపై కలెక్టర్ సమీక్షిస్తూ వట్లూరు ఆర్‌వోబిని పూర్తి చేసే ఉద్దేశ్యము ఉందా? లేదా? అని రైల్వే, ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. ఈ పనులు పూర్తి చేసే విషయంలో సహించేది లేదని ఇప్పటికి సంబంధిత అధికారిని సస్పెండ్‌చేసే ఉత్తర్వులు సిద్ధంగా వున్నాయని ఆయన చెప్పారు. ఆర్ అండ్ బి పరిధిలో అయిదు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు చేపట్టవలసి వుంగా ప్రస్తుతం మూడు పనులు మాత్రమే ప్రతిలో వున్నాయని మిగిలిన రెండింటినీ వెంటనే పూర్తి చేయాలన్నారు. తాను చైనా పర్యటన చేసిన సందర్బంలో ఒక రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించి సంబంధితాధికారులను నిర్మాణ సమాచారాన్ని తెలుసుకోగా 170 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని కేవలం ఒక్క రోజులో పూర్తి చేస్తామని సంబంధిత నిర్మాణ సంస్థ తెలిపిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జిల్లాలో వట్లూరు, భీమడోలు, కోండ్రుప్రోలు, తేతలి, డి ముప్పవరం తదితర గ్యాస్ పైపులైన్ల నిర్మాణ ప్రగతి తీరుపై కలెక్టర్ సమీక్షించారు. వచ్చే వారం నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్దేశించిన అన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్లు కాలనీలు, ఇళ్ల నిర్మాణం బాధ్యతను పంచాయితీరాజ్, గృహ నిర్మాణ సంస్థ, ఆర్ అండ్ బి, గిరిజన సంక్షేమం, ఎపిడబ్ల్యుడిసి తదితర శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. సంబంధిత శాఖలు అన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులను వచ్చే వారంనాటికి పూర్తి స్థాయిలు చేపట్టాలన్నారు.