పశ్చిమగోదావరి

మహిళాభివృద్ధితోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, మార్చి 24: విద్యాభివృద్ధి ద్వారానే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపునేని రాజకుమారి అన్నారు. స్థానిక ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన ఇంటర్, డిగ్రీ, పీజీ సీనియర్ విద్యార్థినులకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు నన్నపునేని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆధునిక సమాజంలో విద్యాభివృద్ధి సాధించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులు లోక జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలిగితే ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారన్నారు. భారత ప్రధాని, రాష్టప్రతి, రాజ్యసభ, లోక్‌సభ స్పీకర్ల వంటి అత్యున్నత పదవులను మహిళలు అధిష్ఠించిన చరిత్ర మన దేశానికుందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నన్నపునేని ఆకాంక్షించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు కళాశాల యాజమాన్య ప్రతినిధి చిట్టూరి సత్య ఉషారాణి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన తేజీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్ నాగప్రసాద్ అండ్ గ్రూప్ నిర్వహించిన సంగీత విభావరి అందర్నీ అలరించింది.

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి

భీమవరం, మార్చి 24: నర్సాపూర్-విశాఖపట్టణం వెళ్లే సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలని సీపీఎం ఆందోళన చేపట్టింది. శనివారం భీమవరంలో సిపిఎం ఈ సందర్భంగా సంతకాలు సేకరించి , ధర్నా చేసి అనంతరం అసిస్టెంట్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డెల్టా జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం దారుణమన్నారు. రైలు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి గాని ఉన్న వాటిని రద్దు చేయడం సబబుకాదన్నారు. రద్దు చేయడం వల్ల నిడదవోలులో ప్రయాణీకులు అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కేందుకు కేంద్రం కుట్ర
*ఎపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ శివాజి
జంగారెడ్డిగూడెం, మార్చి 24: దేశంలో ఎస్సీ, ఎస్టీలను అణగతొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ విమర్శించారు. జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టేవిధంగా వ్వహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ రాష్ట్భ్రావృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చంద్రబాబు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కపటనాటకం ఆడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. మతోన్మాదంతో దళిత, గిరినులు, మైనార్టీలపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని తిప్పికొట్టాలని డాక్టర్ శివాజీ పిలుపునిచ్చారు. దళిత, గిరిజనులను మరింత కిందకు అణచివేయాలనే తప్పుడు తీర్పులు వెలువరించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలు దేశ వ్యాప్తంగా తిప్పికొట్టాలన్నారు. దళిత గిరిజనులకు రక్షణగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో దళిత, గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అనంతరం పలువురు దళితులు, గిరిజనుల నుండి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ శివాజీ వినతి పత్రాలు స్వీకరించారు. పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ జంగారెడ్డిగూడెంలో మూసివేసిన ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు తెరిపించాలని డాక్టర్ శివాజీని కోరారు. అనేక మంది విద్యార్థులకు వసతి గృహాల్లో సరైన వసతులు అందడం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన డాక్టర్ శివాజి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వసతి గృహాలనే మూసివేసారని, వీటిని కూడా త్వరలో తెలిపించే ప్రతిపాదన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ శివాజీ మండలంలో మైసన్నగూడెంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అంబేద్కర్ జీవిత చరిత్ర వివరించి, యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.