క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, ఏప్రిల్ 6: పాత గొడవల కారణంగా భార్యను కత్తితో భర్తే అతి దారుణంగా పొడిచి చంపిన సంఘటన శుక్రవారం మండలంలోని జువ్వలపాలెం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో కాలువ సావిత్రి (55) అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా కలిదిండి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన కాలువ ధనరాజు, సావిత్రి తరచు గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో సావిత్రి జువ్వలపాలెం పశువుల ఆసుపత్రి సమీపాన నివసిస్తున్న ఆమె కుమార్తె రాజమ్మ ఇంటికి వచ్చింది. అయితే ధనరాజు కూడా అక్కడకు వచ్చాడని పోలీసులు తెలిపారు. అయితే ఇంటిలో ఎవరూ లేని సమయంలో భర్త ధనరాజు బార్య సావిత్రితో గొడవ పడి పక్కనే ఉన్న కత్తితో ఛాతిపై పొడిచి చంపాడని పోలీసులు వివరించారు. ఈ సంఘటన చూసిన సావిత్రి మనువడు, మనవరాలు ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కూతురు రాజమ్మ, అల్లుడు బోదనపు నాగరాజుకు విషయాన్ని చెప్పారు. విషయాన్ని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సంఘటనా స్థలాన్ని నర్సాపురం డియస్పీ ప్రభాకర్‌రావు, భీమవరం రూరల్ సిఐ నాగరాజు సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్ల ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేశారు.