పశ్చిమగోదావరి

సమర్ధవంతంగా సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 17 : నష్టాల ఊబిలో ఉన్న ఆర్‌టిసిని లాభాలబాటలో నడిపించడానికి మెంటే పార్ధసారధి ఆర్‌టిసి రీజనల్ ఛైర్మన్‌గా సమర్ధవంతంగా సేవలు అందించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ కోరారు. ఏలూరులో మంగళవారం ఆర్‌టిసి రీజనల్ ఛైర్మన్‌గా నియమితులైన మెంటే పార్ధసారధికి జిల్లా పరిషత్తు మాజీ ఛైర్మన్ కొక్కిరగడ్డ జయరాజుతో కలిసి పాలి ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఎన్నో దశాబ్ధాల నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న పార్ధసారధికి చంద్రబాబు మంచి పదవి ఇచ్చి గౌరవించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెకూ ఆర్‌టిసి బస్సు సౌకర్యాన్ని విస్తరించి ప్రజల పక్షాన ఆర్‌టిసి నిలబడేలా కష్టపడి పనిచేయాలని ముఖ్యంగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్‌టిసిని లాభాలబాటలో తీసుకుని వెళ్లడానికి పార్ధసారధి నిర్మాణాత్మకమైన కృషి చేయాలని ముఖ్యంగా పల్లెపల్లెకు బస్సు సౌకర్యాన్ని కల్పించి గ్రామీణ ప్రాంత ప్రజలంతా సురక్షితంగా తమ గ్రామాలకు చేరుకునేలా ఆర్‌టిసి ఒక నూతన ఒరవడి సృష్టించాలని పాలి ప్రసాద్ కోరారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందనడానికి పార్ధసారధి, సుబ్బారాయుడలకు లభించిన పదవులే నిదర్శనమని జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కె జయరాజు చెప్పారు. పార్ధసారధి సారధ్యంలో ఆర్‌టిసి మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు.
జిల్లా యంత్రాంగం సన్నద్ధం
ఏలూరు, ఏప్రిల్ 17 : సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నదని అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనూ పరిశీలించి సిద్దం చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఇవి ఎంల గోడౌన్‌లను ఆయన తనిఖీ చేసి ఇవి ఎంల బార్ కోడింగ్ విధానాన్ని పరిశీలించారు. లోక్ సభకు గానీ, అసెంబ్లీకి గానీ ఎప్పుడు ఎన్నికలుజరపాలని ఎన్నికల సంఘం ఆదేశించినా ముందస్తుగా ఎన్నికల సామాగ్రిని, ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేయడానికి గోడౌన్‌లో వున్న 8370 ఓటింగ్ యంత్రాలను పరిశీలనా కార్యక్రమాన్ని చేపట్టామని గతంలో వినియోగించిన యంత్రాలను బార్ కోడింగ్ విధానం ద్వారా సరిచూసి మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఏ ఇవి ఎం ఏ పోలింగ్ బూత్‌కు వెళుతుందో స్పష్టమైన సమాచారాన్ని ఎన్నికల సంఘం కలిగి ఉంటుందని ఈ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా రాజకీయ పక్షాల సమక్షంలో ఇవి ఎంల తనిఖీల కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి తన ఓటు ఎవరికి వేసామో ఓటు వేసిన వ్యక్తికి తెలియజేయడం కోసం ప్రత్యేక ఆధునిక యంత్రాన్ని ఇవి ఎంలకు అనుసంధానం చేయడం జరుగుతుందని దీని వలన ఓటు వేసే వ్యక్తికి ప్రత్యేక స్లిప్ వచ్చే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నికల సంఘం అమలు చేయనున్నదని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు తరలించిన ఇవి ఎంలు ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లలోనికి చేర్చేటప్పుడు కూడా బార్ కోడింగ్ పరిశీలన చేస్తామని ఎక్కడా కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పూర్తిపారదర్శకంగా ఇవి ఎం యంత్రాలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. జిల్లాలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆదేశించినా ఎన్నికల సామాగ్రి, ఎన్నికల ఓటింగ్ యంత్రాలుసిద్ధం చేసుకోవడం ప్రతీ సారీ ఒక ఆనవాయితీగా వస్తున్నదని అదే విధానాన్ని ప్రస్తుతం ఏలూరులో అమలు చేస్తున్నామని ఎలక్ట్రానిక్ ఓటింగ్‌యంత్రాల వినియోగం వలన త్వరితగతిన ఓటింగ్ ప్రక్రియ జరగడమే కాకుండా అక్రమాలకు తావులేని విధానాన్ని అమలు చేయగలుగుతామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ దొర, రాధాకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ
వీరవాసరం, ఏప్రిల్ 17: శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామివారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఎనిమిది గంటల నుండి తూర్పుగోదావరి, హైదరాబాద్ నుండి వచ్చిన వేద పండితులు పూర్ణకుంభాలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మశ్రీ పండిత ర్యాలి కృష్ణప్రసాద్, దేవదాయ ధర్మాదాయ శాఖ ఆస్థాన స్మార్త ఆగమ సలహాదారు బ్రహ్మశ్రీ జంధ్యాల జగన్నాధశర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వాస్తు చతుషష్ఠి, క్షేత్రపాలక, నవగ్రహ సర్వతోభద్ర మండప ఆరాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేదమంత్రోచ్ఛరణలతో భక్తులు పులకించిపోయారు. పాలకొల్లు, వీరవాసరం, నర్సాపురం మండలాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం రాజమహేంద్రవరానికి చెందిన బ్రహ్మశ్రీ కేశాప్రగడ సత్యనారాయణ శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.