పశ్చిమగోదావరి

గిరిజన యువతకు కల్పవృక్షం వైటిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, ఏప్రిల్ 20: కోటరామచంద్రపురం ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువత శిక్షణాకేంద్రం (వైటిసి) గిరిజన నిరుద్యోగ యువత పాలిట కల్పవృక్షంగా నిలుస్తోంది. ఉన్నత విద్యార్హతలతో సంబంధం లేకుండా ఐదవ తరగతి పైబడి ఏ స్థాయి విద్య అభ్యించినప్పటికీ విద్యార్థి అభిరుచికి తగిన వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, నూరుశాతం ఉపాధి కల్పనకు కృషిచేయడం శ్లాఘనీయం. 2012 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సుమారు మూడుకోట్ల రూపాయలతో నిర్మించడానికి శిక్షణా కేంద్ర భవనాలకు శంకుస్థాపన చేశారు. రూ.4కోట్లతో భవన నిర్మాణాలు పూర్తిచేసుకున్న అనంతరం 2015 ఏప్రిల్‌లో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖామాత్యులు రావెల కిషోర్‌బాబు శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించారు. సుమారు 300మంది విద్యార్థులు ఏకకాలంలో శిక్షణ పొందడానికి అవసరమైన వసతులను కల్పించింది. విశాలమైన డైనింగ్‌హాలు, కిచెన్, డార్మెంటరీస్, కంప్యూటర్ ల్యాబ్, వైద్యసదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతారణంలో శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కేంద్ర నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించి, 2016 నుండి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ షాన్‌మోహన్ శిక్షణాకేంద్రం నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తూ గిరిజన యువతకు శిక్షణతో పాటు ఉపాధికల్పనకు అవసరమైన చర్యలను తీసుకోవడంతో ఇప్పటివరకు శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నూరుశాతం ఉపాధికి అవకాశం కలిగినట్టు శిక్షణాకేంద్రం మేనేజర్ ఒ సత్యనారాయణ తెలిపారు. ఇప్పటివరకు శిక్షణాకేంద్రంలో డ్రైవింగ్‌లో 30 మంది యువకులు శిక్షణ పొంది విజయవాడకు చెందిన నవత ట్రాన్స్‌పోర్టు కంపెనీలో ఉపాధి పొందారని, మరో నలభైమంది కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పూర్తిచేసుకుని, ఖజానా జ్యుయలరీస్, స్పెన్సర్స్ తదితర కంపెనీల్లో డేటా ఎంట్రీ అపరేటర్లుగా ఉపాధి పొందినట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం సెన్‌టెం ద్వారా ఎయిర్‌టెల్ కంపెనీకి అవసరమైన సెల్ రిపేరింగ్, హౌసింగ్ ఎలక్ట్ఫ్రికేషన్ కోర్సులలో అరవైరోజుల శిక్షణను 30మంది అభ్యర్థులకు ఇస్తున్నట్లు చెప్పారు. నర్సింగ్‌లో 30 మంది పొందుతున్న శిక్షణ ఈ నెల 22వ తేదీతో ముగుస్తుందని, వీరందరికీ ప్లేస్‌మెంట్లు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మరో ఇరవైరోజుల్లో సెయింట్‌జాన్స్ వెల్ఫేర్ సొసైటీకి అవసరమైన డ్రైవర్ల కోసం డ్రైవింగ్‌లో రెండవ బ్యాచ్‌కు శిక్షణను ప్రారంభిస్తామని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు రూ.8000 నుండి రూ.10,000 వరకు వేతనాలుగా లభిస్తున్నాయని, ఉద్యోగం ఇష్టంలేకుంటే స్వయంగా ఉపాధి పొందడానికి కూడా శిక్షణలు ఉపయోగపడతాయన్నారు. స్వయంగా ఉపాధి కల్పించుకునే వారికి ఐటిడిఎ నుండి నిబంధనల మేరకు రుణసహాయం కూడా లభిస్తుందని తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పనలో పిఒ షాన్‌మోహన్, మేనేజర్ ఒ సత్యనారాయణ, కౌన్సిలర్ టిఎఎస్ సత్యవాణి, కో-ఆర్డినేటర్ ఎస్‌వి సత్యనారాయణ, సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయం.