పశ్చిమగోదావరి

టీడీపీని బలహీనపరిచేందుకు మ్యాచ్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 17: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు టీడీపీని బలహీనపరచడానికి ప్రధాని నరేంద్రమోదీ వైసీపీ, అన్నాడియంకె పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ధ్వజమెత్తారు. దేవరపల్లిలో 29 లక్షలతో నిర్మించే ఆర్టీసీ బస్టాండు విస్తరణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారని, బీజేపీకి అడ్డువస్తున్న ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. విభజన చట్టంలో 19 అంశాలను కేంద్రం అమలు చేయాలని సూచించిందని, వాటిలో తొమ్మిది అంశాలను మాత్రమే పరిష్కరించిందన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలను, ప్రభుత్వంపై వచ్చి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా లోపాయికారిగా అన్నాడియంకెతో ప్రధాని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగితే బీజేపీ ప్రభుత్వం పతనం కావడం తథ్యమన్నారు. బీజేపీలో 60 మంది లోక్‌సభ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తమకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందన్నారు. ఈ నెల 20న టీడీపీ నాయకులు చేపట్టేబోయే నిరాహార దీక్షకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. దేవరపల్లిలో నిర్మిస్తున్న బస్‌స్టేషను వల్ల చుట్టుపక్కల యాభై గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ దేవరపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్సులను నిలుపుదల చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఏఎంసీ ఛైర్మన్ ముమ్మిడి సత్యనారాయణ, ఎంపీపీ శ్రీకాకొళపు వెంకట నరసింహారావు, జడ్పీటీసీ కొయ్యలమూడి సుధారాణి, సర్పంచ్ సుంకర యామిని, మాజీ ఎంపీపీ గెడా మురళీ అజిత్‌కుమార్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు మాట్లాడారు. ఆర్టీసీ ఏలూరు రీజనల్ మేనేజర్ జి నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ దేవరపల్లిలో బస్టాండును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం వెళ్లే బస్సులు దేవరపల్లికి వచ్చేలా తాను కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుంకర దుర్గారావు, పిన్నమనేని శ్రీమన్నారాయణమూర్తి, గద్దె సుబ్రహ్మణ్యం, కంటిపూడి సుబ్బారావు, కె రవికుమార్, ఓరుగంటి లక్ష్మీపతిరాజు, కొండపల్లి దొరయ్య, సొసైటీ అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్, దుగ్గిన సూర్యచంద్రం, కాట్రు భీమరాజు, ఆర్టీసీ సీటీయం రామం, నిడదవోలు డిపో మేనేజర్ సురేష్‌బాబు, కొవ్వూరు డిపో మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కోటి రూపాయల వ్యయంతో అండర్ బ్రిడ్జి
ఏలూరు, ఏప్రిల్ 17 : వట్లూరు వద్ద కోటి రూపాయల వ్యయంతో అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చెప్పారు. స్థానిక రామచంద్రరావుపేటలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో మంగళవారం వట్లూరు అండర్ బ్రిడ్జి నిర్మాణ మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తయితే వట్లూరు వైపు వెళ్లాలన్నా వట్లూరు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని దీనిని దృష్టిలో పెట్టుకుని అండర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెపన్పారు. వట్లూరు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని దశాబ్ధం క్రితం శంకుస్థాపన చేసినా నేటికీ బ్రిడ్జి పూర్తి కాలేదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, సకాలంలో పనులు జరగక కాలయాపన జరుగుతూ వచ్చిందని ఎట్టకేలకు తన హయాంలో వట్లూరు రైల్వే బ్రిడ్జి త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నామని అంతేకాకుండా రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కూడా శరవేగంతో జరిగేలా తగు చర్యలు తీసుకుంటామని ఈ మేరకు ప్రభుత్వం నుండి త్వరలో అన్ని రకాల అనుమతులను కూడా తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో వట్లూరు సర్పంచ్ దేవికారాణి, నీటి వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మన లక్ష్మణ మోహన్, సొసైటీ అధ్యక్షులు కొమ్మన వెంకట శ్రీ్ధర్, ఎంపిటిసి బి నాగలక్ష్మి, పంచాయితీ కార్యదర్శి టి ముత్తయ్య, నీటి సంఘం అధ్యక్షులు వేగుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.