పశ్చిమగోదావరి

23న చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 22: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉదయం 11.45 నిముషాలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. విజయవాడ నుండి హెలికాప్టర్‌లో హెలిప్యాడ్‌కు చేరుకునే ముఖ్యమంత్రి ముందుగా స్పిల్ ఛానల్ పనులు ప్రారంభిస్తారు. అక్కడ నుండి డయాప్రం వాల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పనులు పరిశీలిస్తారు. స్పిల్‌వేలోని గేట్ల తయారీ కేంద్రం సమీపంలో 13జిల్లాల నుండి వచ్చే రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. భోజనాల అనంతరం నవయుగ కాంట్రాక్టు ఏజన్సీ కొత్తగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన అనంతం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ వెడతారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం 850 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు పోలవరం డీఎస్పీ ఏడీబి రవికుమార్ తెలిపారు. ఎనిమిది మంది డీఎస్పీలు, 19 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 69 మంది ఏఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు బందోబస్తులో పాల్గొంటారని డీఎస్పీ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందితో ఎస్పీ ఎం రవిప్రకాష్ బందోబస్తు వివరాలు వెల్లడించారు.