పశ్చిమగోదావరి

కామన్‌వెల్త్ విజేత రాహుల్‌కు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 22 : 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన రాగాల వెంకట రాహుల్‌ను జాతీయ మత్స్యకారుల సంఘం ఆదివారం సత్కరించింది. రాష్ట్ర మహిళా విభాగపు అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో రాహుల్‌కు జ్ఞాపికను బహూకరించి దుశ్శాలువాలతో, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ స్టువర్ట్‌పురానికి చెందిన మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రాహుల్ స్వర్ణపతకం సాధించడం బడుగు, బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రాహుల్ తండ్రి రాగాల మధు తన కుమారుని ద్వారా క్రీడారంగంలో దేశానికి గుర్తింపు తీసుకురావడం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మోరు దేవి, బలే నాగనిలక్ష్మి, జి సుజాత, పుష్పశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు జాతి కాపాడుకోవాలి
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 22: దేశీయ పశుసంపద అయిన ఒంగోలు జాతి అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ రైతుపై ఉందని ఒంగోలు గోజాతి అభివృద్ధి సేవాసంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోవాడ అనిల్‌కుమార్ అన్నారు. ద్వారకాతిరుమలలోని బ్రాహ్మణ అన్నదాన భవనంలో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంఘ ప్రతినిధులు, కార్యనిర్వాహక సభ్యులు మొత్తం 180 మంది ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఒంగోలు గో జాతి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే కొన్ని అంశాలపై తీర్మానాలు చేశారు. ఇందులో ప్రధానంగా పశుగ్రాసాభివృద్ధి, అలాగే ఒంగోలు జాతి అభివృద్ధికి కావలసిన వీర్య సేకరణ, ఆబోతుల ఎంపిక, ప్రభుత్వ పరంగా పశువైద్య సేవలు, ఒంగోలు జాతి అభివృద్ధి సేవాసంఘ సభ్యులకు అందించే అంశాలపై పలు తీర్మానాలు చేశారు. వీటిని ప్రభుత్వానికి నివేదిస్తామని అధ్యక్షుడు అనిల్‌కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ రైతు ఇంటా ఈ ఒంగోలు జాతి మమేకమైందన్నారు. అయితే రానురాను జాతి అంతరించిపోతోందని, వీటి అభివృద్ధికి ప్రతీ రైతు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీరమణి, సంఘ రాష్ట్ర కార్యదర్శి బాబూరావు, కిరణ్‌కుమార్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.