పశ్చిమగోదావరి

తీరం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం / మొగల్తూరు ఏప్రిల్ 25: సముద్రంలో భారీ అలలు ఎగిసి పడతాయని సునామీ హెచ్చరికల సంస్థ (ఇన్‌కాయిస్) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తీరంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. నరసాపురం, మొగల్తూరు మండలాల తహసీల్దార్లు జి.సూర్యనారాయణ రెడ్డి, ఎస్.హరనాధ్‌లు తీరంలోని పెదమైనవాని లంక, వేములదీవి, తూర్పుతాళ్ళు, పేరుపాలెం, కె.పి పాలెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రం మీదుగా ప్రచండ గాలులు వచ్చే ప్రమాదం ఉన్నందున రెండ్రోజుల పాటు ఎవరూ సముద్ర స్నానం, చేపల వేటకు వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా మారి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లు సూర్యనారాయణరెడ్డి, హరనాధ్‌లు ఆదేశాలు జారీ చేశారు.
గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 24: గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ మండలంలోని గొల్లగూడెం గ్రామస్థులు మంగళవారం ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. గుక్కెడు నీళ్ల కోసం కొన్నాళ్లుగా అలమటిస్తున్నా కనీసం పట్టించుకోరా అంటూ వారు ఆందోళన చేశారు. దీంతో ద్వారకాతిరుమల - భీమడోలు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బుజ్జగించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గొల్లగూడెం గ్రామస్థులను గత కొంతకాలంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పంచాయతీ అందిస్తున్న చాలీ చాలని నీటితో ప్రజలు అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే కొద్ది నెలలుగా ఈ నీటిని సైతం గ్రామంలోని ఒక చేపల చెరువుకు మళ్లిస్తున్నారు. దీంతో ప్రజలకు చుక్కనీరు దొరక్క అలమటిస్తున్నారు. ఈక్రమంలో వారు ఆందోళన బాట పట్టారు. ఖాళీబిందెలతో ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తూ పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండు వేసవిలో నీటి సమస్యను తాళలేక పోతున్నామని, పాలకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని వారు వాపోయారు. తాగునీటిని చేపల చెరువులోకి వెళ్లకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు అడ్డుకోలేదని వారు ధ్వజమెత్తారు. తమ తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.