పశ్చిమగోదావరి

సీతమ్మ చెంతకు నరసాపురం రాజీనామాల వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 24: నరసాపురం మున్సిపల్ ఛైర్మన్ రత్నమాలతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు డిఇ శ్రీకాంత్ విషయంలో రాజీనామా చేసిన వ్యవహారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా కౌన్సిల్ అంతా రాజీనామా చేయడంతో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో జిల్లా పార్టీ నేతలు మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో నరసాపురంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఛైర్‌పర్సన్ రత్నమాల, రాజీనామాలు చేసిన కౌన్సిల్ సభ్యులతో ఆయన చర్చలు జరిపారు. అదే విధంగా గతంలో అక్కడ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది ఆయన వర్గీయులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆయన పైన కూడా బాధ్యతలు పెట్టింది. వీరిరువురు కూడా వారి వారి వర్గాలతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకువచ్చి జిల్లా పార్టీ అధ్యక్షురాలిని కలిశారు. ఎటువంటి వివాదం లేకుండా పార్టీ శ్రేణులకు న్యాయం చేయాలని పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
కాలువలు 25వ తేదీన కడతారా
ఉండి, ఏప్రిల్ 24: పశ్చిమ డెల్టా కాలువలు ఈ నెల 25వ తేదీన కడతారా లేదా అనేది అధికారులు ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. ఈ నెల 20న కాలువలు కట్టేస్తున్నట్టు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించినా కాలువలకు మాత్రం పూర్తిగా మంగళవారం వరకు నీరు విడుదలవుతూనే ఉంది. 20వ తేదీన వెయ్యి క్యూసెక్కులు విడుదల చేసిన మరుసటి రోజు నుండి రెండువేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. మంగళవారం కూడా పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కులు విడుదల కాగా అందులో ఉండి కాలువకు 500 క్యూసెక్కులు పంపించారు. అయితే కొందరు అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను 25న కాలువలు కట్టేస్తారని చెబుతున్నారు. అయితే ఇది అధికారికంగా అధికారులు ప్రకటించలేదంటున్నారు. 25వ తేదీ సాయంత్రం వరకు నీరు ఇచ్చిన తరువాత సాయంత్రం కాలువలు కడతారని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు. చివరకు జిల్లా యంత్రాంగం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని అధికారులు అంటున్నారు.