పశ్చిమగోదావరి

విమానాశ్రయ భూములకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 26: అయిదు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న విమానాశ్రయ భూముల గృహ యజమానులకు పట్టాలిచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని, తద్వారా వాగ్దానం నెరవేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు లేఖ రాశారు. విలువైన భూమి అయినందున పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ దరఖాస్తుదారులకు సంక్షిప్త సందేశాలను ప్రభుత్వ పరంగా పంపడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. పట్టాలు మంజూరు చేయకుంటే ముమ్మాటికి ఇది వాగ్దాన భంగమేనన్నారు. కొందరు స్వార్థపరులు అధికారులపై ఒత్తిడితెచ్చి పట్టాలిచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నారంటూ ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతులను గురువారం ఎమ్మెల్యే మాణిక్యాలరావు పత్రికలకు విడుదల చేశారు. 2014 ఎన్నికల సమయంలో తాను అభ్యర్థిగా ప్రజలకు హామీనిచ్చానని, 2015, ఆగస్టు 20న ఏపీ నిట్ శంకుస్థాపన వేదికపై సీఎం చంద్రబాబు విమానాశ్రయ భూములకు పట్టాలు ఇస్తామని స్పష్టమైన హామీనిచ్చారని గుర్తుచేశారు. తదుపరి తాను మంత్రివర్గ సమావేశంలో దఫ దఫాలుగా చర్చించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఆ మేరకు జీవో 118 (రెవెన్యూ)ను 2016 విడుదల చేశారన్నారు. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములు, విమానాశ్రయ భూమిలో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా స్పష్టమైన ఆదేశాలిచ్చారని లేఖలో మాణిక్యాలరావు తెలిపారు. అయితే క్రమబద్ధీకరించేందుకు వీలు కాదంటూ దరఖాస్తుదారుల సెల్‌ఫోన్లకు ప్రభుత్వం నుంచి సంక్షిప్త సందేశాలు అందాయన్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. జీవో 118లో విమానాశ్రయ భూముల్లో నివసించే వారికి పట్టాలు ఇస్తామంటూ స్పష్టంగా పేర్కొని, ఇప్పుడు పట్టాలు ఇవ్వడం కుదరదని తెలియజేయడం ముమ్మాటికి వాగ్దానభంగమే అవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టిసారించి విమానాశ్రయ భూముల్లో నివసించేవారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడి ప్రజలకు న్యాయంచేయాలని ఎమ్మెల్యే మాణిక్యాలరావు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.