పశ్చిమగోదావరి

కాంగ్రెస్ దోస్తీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 26: ఈ పై ఫొటోలో ఉన్న వారిని గుర్తు పట్టారా ? వీరు ముగ్గురు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. భీమవరంలో ఒక వేడుకకు వచ్చిన మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను నాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వబిలిశెట్టి కనకరాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
దూసుకుపోయిన ఇసుకలారీ
కొవ్వూరు, ఏప్రిల్ 26: కొవ్వూరు శివారు ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో గురువారం ఇసుక లోడుతో ఉన్న ఒక లారీ అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకుపోయింది. కాగా ప్రమాదంలో ఏవిధమైన ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. గోదావరి నదిలో ఇసుక లోడు కోసం ఉన్న పడవను ఢీకొట్టడంతో పడవ పూర్తిగా దెబ్బతింది. వివరాల్లోకి వెళ్తే.. ఔరంగాబాద్ నుండి ఇసుకను రవాణా చేయడానికి లారీని ర్యాంపులో నిలుపుదల చేశారు. ఇసుక లోడ్ చేస్తుండగా లారీ అదుపుతప్పి గోదావరి నదిలోకి దూసుకుపోయింది.
నీటి విడుదలను పూర్తిగా నిలుపుదల
ఉండి, ఏప్రిల్ 26: ఉండి సబ్ డివిజన్‌కు నీటి విడుదలను పెంచినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ డెల్టాకు 1500 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. ఉండి సబ్ డివిజన్‌కు మాత్రం 1300 క్యూసెక్కులు నీరు విడుదలవుతుందంటున్నారు. అందులో ఉండి కాలువకు 1050 క్యూసెక్కులు, వెంకయ్య వయ్యేరుకు 250 క్యూసెక్కులు నీరు విడుదలవుతుందంటున్నారు. జిల్లాలో అధికారికంగా ఈ నెల 20న కాలువలు కట్టేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ వరకు కాలువలకు నీరు విడుదలచేసి కాలువలు కట్టేస్తామని అధికారులు రెండవసారి పేర్కొన్నారు. అయితే తిరిగి ఉండి కాలువకు నీటి విడుదల పెంచారు. ఎన్ని రోజులు నీరు విడుదలవుతుందో అధికారులు చెప్పలేకపోతున్నారు. అయితే జిల్లాలో చాలా కాలువలకు నీటి విడుదలను పూర్తిగా నిలుపుదల చేశారంటున్నారు.