పశ్చిమగోదావరి

కన్నుల పండువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 26: శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలకు ఆహ్వానం పలుకుతూ గురువారం రాత్రి జరిగిన ధ్వజారోహణం వేడుక భక్తజన కోటికి కన్నుల పండువైంది. వైఖానస ఆగమ యుక్తంగా చరాచర సృష్టిని స్వాగతిస్తూ వేద మంత్రోచ్ఛరణలతో ఆలయ అర్చకులు శ్రీవారి ఆలయ ప్రాకారంలోని ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఆవిష్కరించారు. ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తజనులు పరవశించారు. అంతకు ముందు ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయల యజ్ఞశాలలో హోమాది కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించి, అనంతరం నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో..
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 26: హంస వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన శ్రీవారు క్షేత్ర పురవీధులకు పయనమయ్యారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో ఉన్న స్వామివారు ఉభయ దేవేరులతో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను హంస వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిధ్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ శ్రీవారి వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. అలాగే ఆలయ శ్రీహరి కళాతోరణ వేదికపై విజయవాడ, రాజమహేంద్రవరానికి చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను అలరించాయి. అధిక సంఖ్యలో యాత్రికులు ఈ కార్యక్రమాలను వీక్షించారు.
జవహర్ సంచలన వ్యాఖ్యలు
తాళ్లపూడి, ఏప్రిల్ 26: గవర్నర్ గారూ.. దయచేసి ప్రజలు వద్దనకుండానే గౌరవంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లండంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కెఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయమై తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా గురువారం తాళ్లపూడి మండలంలోని తాడిపూడి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించకపోవడానికి పరోక్షంగా గవర్నరే కారణమంటూ మంత్రి జవహర్ గవర్నర్ నరసింహన్‌పై విమర్శల దాడి చేశారు. 11 సంవత్సరాలుగా ఒకే గవర్నర్ రాష్ట్రంలో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా పనిచేసే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కోరుతోందన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేవలం గుళ్లూ, గోపురాలు తిరగడానికే తప్ప రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, కష్టాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. హుదూద్ తుఫాను విషయంలో గాని, ప్రత్యేక హోదా విభజన హామీల అమలులోగాని రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన గవర్నర్ పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రానికి, రాష్ట్రానికి అనుసంధానంగా ఉండాల్సిన గవర్నర్ కేంద్రానికే బాధ్యత వహిస్తున్నారని, ఆయన నారద పాత్ర విడనాడాలన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసినపుడు మాత్రమే గవర్నర్‌ను మన రాష్ట్రంలో చూశానని, రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ తెలంగాణాలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు ఒక నెల అక్కడా ఒక నెల ఇక్కడా ఉండాలన్నారు. దయచేసి గౌరవంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని, వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావుకు రామ్‌లాల్ వంటి గవర్నర్ ఎలా పనిచేశారో అదే చరిత్ర ఈ గవర్నర్ ద్వారా పునరావృతమవుతోందన్నారు. గవర్నర్ నరసింహం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని, అంటూ గుక్క తిప్పుకోకుండా ఆరోపణలు చేస్తూనే ఆయన పట్ల తనకు దురభిప్రాయం లేదని మంత్రి పేర్కొన్నారు.