పశ్చిమగోదావరి

సిఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం దేవరపల్లి రానున్న దృష్ట్యా అందుకు తగ్గ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ముందుగా దేవరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిఫ్యాడ్‌ను పరిశీలించారు. సిఎం పర్యటించే ప్రాంతాలను, పోలవరం కుడి కాలువ పనులను పరిశీలించారు. చంద్రబాబు విజయవాడ నుండి నేరుగా దేవరపల్లికి శనివారం ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. హెలికాఫ్టర్ దిగిన వెంటనే దేవరపల్లి పంచాయతీ నిర్మించిన 5 కిలోమీటర్ల సిసి రోడ్డును పైలాన్ ద్వారా ఆయన ఆవిష్కరిస్తారన్నారు. పోలవరం కుడి కాలువ పనులు పరిశీలించి, అక్కడే అధికారులతో సమీక్షిస్తారన్నారు. పోలవరం కుడి కాలువ రెండో దశ 14.8 కిలోమీటర్ల నుండి 38.19 కిలోమీటర్ల మధ్య జరుగుతున్న పనులను పరిశీలిస్తారని ఇఇ గంగరాజు తెలిపారు. 24 కిలోమీటర్ల పరిధిలో 8 బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 12 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయవలసి ఉందని ఇఇ చెప్పారు. జాస్ కటింగ్ ద్వారా 8లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయవలసి ఉందన్నారు. ప్రస్తుతం 17 మిషన్లు పనిచేస్తున్నాయని, మరి కొన్ని మిషన్లు పెంచవలసిందిగా కలెక్టర్ ఆదేశించినట్టు తెలిపారు. రోజుకు 30వేల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎంపిపి శ్రీకాకోళపు వెంకట నర్సింహారావు, డిప్యూటీ కలెక్టర్ నిశాంత్‌కుమార్, కొవ్వూరు ఆర్డీవో శ్రీనివాస్, ఇంటిల్‌జెన్స్ డిఎస్పీ భాస్కర్, కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, తహసీల్దార్ అక్బర్ హుస్సేన్, ఎంపిడిఒ కె కోటేశ్వరరావు, ఉపాధి ఎపిఒ దేవిక, పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.