పశ్చిమగోదావరి

రహదారులపై ఆక్రమణలు తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21 : జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రహదారులు ఆక్రమణలకు గురి కావడంతో రోడ్లు కుదించుకుపోవడం వలన ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం గ్రామానికి చెందిన తిలక్ అనే వ్యక్తి మాట్లాడుతూ కొయ్యలగూడెం నుండి గవరవరం వెళ్లే రహదారి ఆక్రమణ వలన ప్రమాదాలుజరిగి ఎంతో ప్రాణనష్టం జరుగుతోందని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఆర్ అండ్ బి, పంచాయితీ, జిల్లా పరిషత్, తదితర రహదారులు కుదించుకుపోయి ప్రజలుప్రయాణాలకు అనువుగా లేక ప్రమాదాలు బారిన పడుతున్నారన్నారు. ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించాల్సిందేనని, అధికారులు ఈ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. రోడ్ల ఆక్రమణలను తొలగించి అవసరమైన చోట్ల రోడ్లను రిపేర్లు చేయించి ప్రయాణానికి అనువుగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీరవాసరం మండలం నండమూరుకు చెందిన చిన్నంశెట్టి నవీన్ మాట్లాడుతూ 2011లో తన మేనత్త నీలం సత్యవతికి ప్రభుత్వ పట్టా మంజూరు చేశారని, అయితే ఆమె మరణించినట్లు చూపించి ఆ పట్టాను రద్దు చేశారని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ లబ్దిదారులు బతికి వున్నప్పటికీ మరణించినట్లు తీర్మానం చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తూ ఆ పట్టాను ఎందుకు రద్దు చేశారని వీరవాసరం తహశీల్దార్‌ను ప్రశ్నించారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. పాలకొల్లు మండలం వర్ధినం నుండి ఒక వ్యక్తి మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 13, 14, 15 లలో చేపల చెరువులకు బదులు రొయ్యలు సాగు చేస్తున్నారని, దాని వలన సమీపంలోని పంటపొలాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై వెంటనే పరిశీలన జరిపి అనుమతులు లేని చెరువులను ధ్వంసం చేయాలని మత్స్యశాఖ జెడిని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి, డి ఆర్‌వో సత్యనారాయణ, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిపివో ఎం వెంకటరమణ, ఎల్‌డి ఎం సూర్యారావు, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు.