పశ్చిమగోదావరి

సమసిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 22 : జిల్లా కలెక్టర్, టీచర్ల మధ్య తలెత్తిన వివాదం మంగళవారంతో సర్దుమణిగింది. ఈ ఆందోళనకు స్వస్తి పలకాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, డిఇవో సివి రేణుక, ఎన్‌జివో నేతలు ఆర్‌ఎస్ హరనాధ్, చోడగిరి శ్రీనివాస్, ఐవిఎస్ ఎన్ రాజుతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి మంగళవారం చర్చలు జరిపారు. స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన ఈ చర్చల్లో అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులను తానెప్పుడూ కించపరచలేదని, మంచి విద్యాబోధన చేస్తే భావితరాలకు బంగారు భవిష్యత్తు అందుతుందన్న ఉద్దేశ్యంతోనే పలు సూచనలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతీ ఒక్కరూ సానుకూల దృక్పధంతో ఆలోచన చేసి విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి చేయాలని కోరారు. నేటి నుంచి తమ ఆందోళన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, ఇకపై సమన్వయంతో పనిచేస్తామని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పి జయకర్, బిఎ సాల్మన్ రాజు, పి వెంకటేశ్వరరావు, నారాయణరావు, మనోజ్‌కుమార్, జి కృష్ణ, రాజబాబు రాజ్‌కుమార్, జి నాగేశ్వరరావు, లాల్ నెహ్రూ, కెఎస్‌ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసు శాఖకు కొత్త వాహనాలు, జాగిలాలు
ఏలూరు, మే 22 : జిల్లా పోలీసు శాఖకు కొత్తగా ఆరు వాహనాలు, రెండు జాగిలాలు వచ్చి చేరాయి. నేషనల్ వైడ్ ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ నెంబర్ 112ను కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా స్టేషన్ వైడ్ ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కోసం జిల్లాకు ఆరు కొత్త వాహనాలను కేటాయించారు. అదే విధంగా జిల్లాకు కొత్తగా వీర, గ్రీసి అనే రెండు జాగిలాలను కూడా కేటాయించారు. వీటిని స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిన సమయంలో, పోలీసు విధుల గురించి ప్రజలు 112 నెంబర్‌కు తెలియజేస్తే సదరు వాహనాల్లో ఉన్న సిబ్బంది త్వరితగతిన ఆ ప్రాంతాలకు చేరుకుని ప్రజలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బి డి ఎస్‌పి ఎం శ్రీనివాసరావు, ఎ ఆర్ అదనపు ఎస్‌పి ఎం మహేష్‌కుమార్, ఎ ఆర్ ఆర్ ఎస్ ఐ శ్రీనివాసరావు, డిసి ఆర్‌బి సిబ్బంది, వీర జాగిలం హాండ్లర్ ఎ ఆర్ పిసి బి సుగుణరావు, గ్రీసి హాండ్లర్ ఎ ఆర్ పిసి సిహెచ్ మహేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ
పెదవేగి, మే 22 : ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎ ఎన్‌ఎంలను లైంగికంగా వేధిస్తున్నారని పిహెచ్‌సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్‌వో) ఎం ఫణికుమార్‌పై వచ్చిన ఆరోపణలపై అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ జి రత్నకుమారి విచారణ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం పిహెచ్‌సికి వచ్చిన ఆమె పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ఎన్ మనోజ్‌కుమార్‌తోపాటు సిబ్బందిని విచారించారు. బాధిత ఎ ఎన్ ఎంలను విచారించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ జి రత్నకుమారి మాట్లాడుతూ పెదవేగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్‌వోగా పనిచేస్తున్న ఎన్ ఫణికుమార్ పిహెచ్‌సిలో పనిచేస్తున్న ఎ ఎన్ ఎంలను లైంగికంగా వేధిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై డి ఎంహెచ్ ఓ ఆదేశాల మేరకు తాను విచారణ నిమిత్తం పెదవేగి పిహెచ్‌సికి వచ్చామని తెలిపారు. విచారణ నివేదికను డిఎంహెచ్‌ఓ కు సమర్పిస్తామని, నివేదిక ఆధారంగా డిఎంహెచ్‌ఓ తదుపరి చర్యలు తీసుకుంటామని రత్నకుమారి తెలిపారు.