పశ్చిమగోదావరి

ఉల్లాసంగా, ఉత్సాహంగా జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మే 24: వైఎస్ జగన్ పాదయాత్ర ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. బుధవారం రాత్రి గణపవరం మండలం సరిపల్లె వద్ద బసచేసింది. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుండి ప్రారంభమైన యాత్ర ఉండి మండలంలో ప్రవేశించింది. మండలంలోని ఆరేడు గ్రామం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆరేడు వద్ద జగన్ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఎవరికి వారే స్వయంగా చేతులు చాచి జగన్‌ను కలవాలని, చూడాలని ప్రయత్నించారు. జగన్ చుట్టూ పహారా కాస్తున్న రోప్ పార్టీ ఎవరికీ అనుమతి ఇవ్వకుండా చుట్టూ వలయంలా కాపు కాశారు. అయితే కొద్దిమంది నాయకులకు ఆయన పక్కన నడిచి సమస్యలు వివరించే పరిస్థితి కలిగింది. ఆరేడు వద్ద జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు ముందుకు వచ్చారు. జగన్‌ను కలిసేందుకు కొద్దిసేపు తోసుకున్నారు. పోలీసులు మాత్రం ఎవరినీ దగ్గరకు రానీయకుండా దూరంగానే ఉండి జగన్‌ను చూసే విధంగా ప్రయత్నాలు చేశారు. పాదయాత్ర వెంబడి మహిళలకు మాత్రం జగన్ కలిసి సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించారు. మహిళలను పోలీసులు లోనికి రానివ్వరని గ్రహించిన జగన్ ముందుగానే వారిని లోపలికి ఆహ్వానించారు. వారి సమస్యలు విన్నారు. మహిళలు, యువకులు సెల్ఫీ తీయించుకున్నారు. ఒక్కొక్కరి ఫోన్‌లో ఆయనే స్వయంగా సెల్ఫీ తీస్తూ వారిని ఉత్తేజపరిచారు. దారి పొడవునా మహిళలు కొన్నిచోట్ల హారతులు పట్టారు.
కొల్లేటివాసుల సమస్యలు పరిష్కరించండి
కొల్లేటి గ్రామాలకు చెందిన మహిళలు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లగక్కుకున్నారు. ఆరేడు ప్రాంతానికి ఆగడాలలంక గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంచినీటి సీసాలలో పసరు రంగుతో ఉన్న నీటిని తీసుకువచ్చి ఆయనకు చూపించారు. కొల్లేటి పైనే ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నామని వివరించారు. బిసి (వడ్డెర), దళిత కుటుంబాలకు చెందిన తామంతా కొల్లేరు ధ్వంసం చేసిన తర్వాత వలసలు వెళ్లే పరిస్థితి ఎదురైందన్నారు. తాగేందుకు మంచినీరు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. తమకు ప్రతీ పేదవాడికి ఒక ఎకరం భూమి ఇప్పించాలన్నారు. అలాగే 30 ఎకరాల్లో మంచినీటి చెరువు తవ్వించి నీటి కాలుష్యం బారి నుండి తమను కాపాడాలన్నారు. ప్రస్తుతం తామంతా చేపల చెరువుల నుండి వదిలే నీరు కాలవల ద్వారా కలుస్తున్నందున ఆ నీటినే తాగుతున్నామని వివరించారు. అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై జగన్ మహిళలతో మాట్లాడుతూ పెన్షన్ వయస్సును 45 సంవత్సరాలకే తగ్గిస్తున్నానన్నారు. రూ.2 వేలు పెన్షన్ రావడంతో పేదవాడికి ఇబ్బందే ఉండదన్నారు. అలాగే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వయసు పైబడిన వారు వారికొచ్చే పెన్షన్ రెండు వేలతో కొంతమంది వృద్ధాశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జగన్‌కు ఉండి నియోజకవర్గం నాయకులు పీవీఎల్ నరసింహరాజు, పాతపాటి సర్రాజు, మంతెన యోగేంద్రబాబు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.