పశ్చిమగోదావరి

ఉండి మహానాడులో మూడు తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, మే 24: ఉండిలో జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడుకు జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే బి.మాధవనాయుడు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు తప్ప మిగిలిన ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మూడు ప్రధాన తీర్మానాలు చేశారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నాయకత్వంలో జిల్లాకు చెందిన ప్రముఖులు, అడవుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు బాబు, యర్రా నవీన్, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మేఘనాదేవి, జిల్లా పరిషత్ ఉపాద్యక్షురాలు మనె్న లలితాదేవి, మహిళా కమిషన్ మెంబర్ డా.రాజేశ్వరి, పార్టీ జిల్లా కార్యదర్శి సోంబాబు, కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, మాగంటి రామ్‌జీ, బోళ్ల రాజీవ్, ఉండి మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, ఆకివీడు ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్, జుత్తిగ నాగరాజు, జుత్తిగ శ్రీనివాస్, కట్టా రాంబాబు, తోట ఫణిబాబుతో పాటు జిల్లాకు చెందిన మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శివరామరాజు ఘనస్వాగతం
జిల్లా నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రధాన ద్వారం వద్ద నిలబడి పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. జిల్లాపరిషత్ వైస్ ఛైర్మన్ మనె్న లలితాదేవి ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు మహిళా ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు.
తోటకు ఘన సత్కారం
ఉండి నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని ఘనంగా సత్కరించారు. పార్టీని నడిపించటంలో ఆమె చేస్తున్న కృషికి అభినందనపూర్వకంగా ఈ సత్కారం అని మహిళా నాయకురాళ్లు పేర్కొన్నారు.
అందరికన్నా ముందొచ్చిన శ్రీను
గురువారం ఉండిలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు ప్రజాప్రతినిధుల్లో అందరికన్నా ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను) ముందుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేశారు. తరువాత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అనంతరం ఒక్కొక్కరుగా సభా స్థలికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగింది. ఉండి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు రావటంతో మహానాడు సందడిగా సాగింది.