పశ్చిమగోదావరి

కుదేలైన రొయ్య రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 25: మెట్టప్రాంతంలో ఆక్వా సాగుచేసి విజయం సాధించాలని ఆ యువ రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఆ రైతులు తీరని నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. మెట్ట ప్రాంతమైన ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ఆక్వా సాగును ప్రయోగాత్మకంగా చేబట్టినప్పటికీ చివరి వరకూ అవి ఆశాజనకంగానే ఉంది. అయితే అకాల వర్షాలు, ఉమ్మగిస్తున్న వాతావరణం వల్లే శుక్రవారం చెరువులోని రొయ్యలు చనిపోయాయని రైతులు వాపోతున్నారు. బాధిత రైతుల కథనం ప్రకారం..స్థానిక పంచాయతీకి చెందిన ఎకరన్నత విస్తీర్ణం గల చెరువును చేపల సాగు నిమిత్తం గ్రామానికి చెందిన రైతు మధ్యాహ్నపు దుర్గారావు మూడేళ్ల కాల పరిమితికి లీజుకు తీసుకున్నాడు. గతేడాది చేపలను పెంచాడు. అయితే మెట్టలో రొయ్యలు సాగుచేయాలన్న కోరిక ఆ రైతులో కల్గింది. అతనికి మధ్యాహ్నపు నారాయణరావు, జంగా అంజిబాబు, బి సత్తిబాబు అనే యువ రైతులు తోడయ్యారు. ఎలాగైనా ఆక్వా సాగుచేసి విజయాన్ని సాధించాలని బలంగా నిశ్చయించుకున్నారు. వెంటనే కాకినాడ నుంచి రూ.1.5 లక్షలు వెచ్చించి రొయ్యి పిల్లలను తీసుకువచ్చి ఎకరన్నర చెరువులో వేశారు. వాటికి ఆక్సిజన్ అందేలా ఫ్యాన్లు, అవి తిరిగేందుకు ఇంజిన్లు ఏర్పాటుచేసి అందులో డీజిల్ పోసేవారు. అంతే కాకుండా నీటిలో ఉప్పును సైతం కలిపేవారు. ఇదిలా ఉంటే..ఎప్పటికప్పుడు చెరువులోని నీటిని భీమవరంలోని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్ష చేయించేవారు. వారం రోజుల క్రితం రొయ్యల బరువును పరిశీలించగా 80 కౌంటు వచ్చిందని రైతులు చెబుతున్నారు. వచ్చే ఆదివారం రొయ్యలను పట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్నామని, ఇంతలో వాతావరణంలో వచ్చిన పెనుమార్పులతో రొయ్యలు మొత్తం చనిపోయి తమని నట్టేట ముంచాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకూ మెట్టప్రాంతంలో ఆక్వా సాగుచేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయని పరిస్థితిలో తాము రూ.3లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి, సాగు చేబట్టామన్నారు. అయితే రొయ్యలు చనిపోవడంతో సుమారు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని వారు చెబుతున్నారు. చనిపోయిన రొయ్యలు చెరువు అడుగుభాగంలోకి వెళ్లిపోవడంతో వాటిని బయటకు తీసేందుకు రైతులు శ్రమిస్తున్నారు.