పశ్చిమగోదావరి

నాణ్యతలో రాజీపడవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, మే 25: నిర్వాసితుల కోసం నిర్మించే గృహాల నాణ్యతలో ఎటువంటి రాజీపడవ్దని జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని దొరమామిడి, పడమర రేగులకుంట, రెడ్డిగణపవరం గ్రామాలలో పునరావాసం కింద నిర్వాసితులకు గృహాలు నిర్మించనున్న స్థలాలను, నిర్మించిన గృహాలను, భూములను శుక్రవారం జెసి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పోలవరం మండలం సరుగుడు, పల్లపూరు, పైడాకులమామిడి గ్రామాలకు చెందిన నిర్వాసితులకు బుట్టాయగూడెం మండలంలో గృహాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.2.8లక్షలు వ్యయం కాగా కమ్యూనిటీ హాలు, రోడ్డు కనెక్టివిటీ, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వాటర్‌ట్యాంకు, తదితర వౌలికవసతులతో కలిపి ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వ జివో ప్రకారం సుమారు ఏడులక్షల రూపాయల వరకు అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో నిర్వాసితుల కోసం సుమారు 30వేల గృహాలను నిర్మించునున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు లక్ష గృహాలు నిర్మాణంలోని వివిధ దశల్లో ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు అంతటా ఒకే నమూనా ఇళ్ళను నిర్మిస్తారని వివరించారు. జేసీ వెంట తహసీల్దారు ఉదయభాస్కర్, ఆర్‌ఐ షరీఫ్, సర్వేయర్లు వీరాస్వామి, మురళీ, తదితరులున్నారు.

అట్రాసిటీ చట్టాలపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్ర
* కమీషన్ చైర్మన్ కారెం శివాజీ

భీమవరం, మే 25: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల పై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. శుక్రవారం న్యాయవాది డికేవీ ప్రకాష్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చట్టాలను నీరు గారిస్తే సహించమని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకివచ్చాక దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునేందుకు అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. గంటా సుందర్‌కుమార్, పాకెర్ల బెన్నీపాల్, కటికతల రాజారావు, పాలపర్తి జోనా, బొడ్డు విక్టర్‌బాబు, బళ్ళరత్నరాజు పాల్గొన్నారు.