పశ్చిమగోదావరి

అభివృద్ధి కార్యక్రమాలు చాటిచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, మే 25: కొవ్వూరు పురపాలక సంఘ పరిధిలోని వివిధ వార్డులలో గత నాలుగేళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. శుక్రవారం కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో ఛైర్‌పర్సన్ జె రాధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి జవహర్ మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఛైర్‌పర్సన్ రాధారాణి మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి సమన్వయంతో అందరూ కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ టి నాగేంద్రకుమార్, వైస్‌ఛైర్మన్ డి రాజారమేష్ తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్‌మేళాలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు

భీమవరం, మే 25: మెగా జాబ్‌మేలతో పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆక్నూ వీసీ ప్రోఫెసర్ ముత్యాలనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ సీఎస్‌ఎన్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ సక్కుమళ్ళ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాను ఆయన కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు గోదావరి జిల్లాల్లో ఇటువంటి మెగా జాబ్‌మేళాను చూడలేదని కళాశాలను అభినందించారు. వరి పండించే ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రావాల్సిన అవస్యకత ఎంతైన ఉందని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ మెంటే పార్ధసారధి, బీజేపీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రసంగించారు. సుమారు రెండువేల మంది నిరుద్యోగ యువత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.