పశ్చిమగోదావరి

రొయ్య రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, మే 25: రొయ్య రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వైసీపీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామశివారు నుండి పాదయాత్ర ప్రారంభమై చినకాపవరం వరకు సాగింది. చినకాపవరంలో యండగండి శ్రీనుకు చెందిన రొయ్యల చెరువు పరిశీలించారు.రొయ్యల చెరువులో మొదట మేత చల్లి, వలవేసి రొయ్యలను పరిశీలించి శ్రీను నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచి సీజన్‌లో రొయ్యలు పట్టుబడి పడుతుంటే వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించేస్తున్నారన్నారు. దీంతో రైతులు ఎకరానికి లక్ష నుండి 1.5 లక్షలు నష్టపోతున్నామన్నారు. దీంతో జగన్ మాట్లాడుతూ రొయ్యలు సాగు ఎక్కువ చేసే ప్రాంతాలలో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని వారు ఇష్టమొచ్చినప్పుడు అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామన్నారు. దీని నిమిత్తం ఒక ప్రత్యేక కమిటీ వేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పివియల్ నర్సింహరాజు, పాతపాటి సర్రాజు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వింటూ ముందుకు...
జగన్ పాదయాత్ర ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగింది. పెదకాపవరం శివారు నుండి ప్రారంభమైన పాదయాత్ర చినకాపవరం మీదుగా గుమ్ములూరు, కోళ్లపర్రు మీదుగా ఆకివీడు వరకు సాగింది. మార్గం మధ్యలో పలు చోట్ల జగన్‌కు మహిళలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. రైతు రుణమాఫీ జరగలేదని పెదకాపవరంలో మహిళ జగన్‌కు వివరించారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆకివీడు మండల అవుట్ సోర్సింగ్ ద్వితీయ ఎఎన్‌ఎంలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అలాగే సీపీయస్ విధానం రద్దు చేయాలని ఆకివీడు మండల ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. యువకులు కేరింతలు కొడుతూ జగన్‌తో పాదయాత్రలో పాల్గొనగా పలుచోట్ల మహిళలు హారతులు పడుతూ జగన్‌తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు.
32 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములు స్వాధీనం
జంగారెడ్డిగూడెం, మే 25: మండలంలోని పంగిడిగూడెంలో 32 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిలో ఎపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 300 మంది నిరుపేదలు ప్రవేశించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ పంగిడిగూడెంలో గత 15 సంవత్సరాలుగా భూమిలేని పేదలు ల్యాండ్ సీలింగ్ భూములు పంచాలని పోరాటాలు నిర్వహిస్తుంటే అధికారులు భూస్వాములకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై స్థానిక తహసీల్దారు, ఆర్డీవోకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేదన్నారు. అందుకే వ్యవసాయ కార్మికులతో భూస్వాధీన ఉద్యమం చేస్తున్నామని, ఇకనైనా అధికారులు భూస్వాములపై కేసులు పెట్టి, పేదలకు భూములు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి మానుకొండ జీవరత్నం, నేతలు పొడపాటి ఘటోత్కచుడు, అందుగుల ప్రభాకరరావు, రాంబాబు, ఎం బాలరాజు, బేతాళ కోటేశ్వరరావు, కె.సుబ్బారావు, మరియమ్మ, జొన్నకూటి అంజలి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు గుడెల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.