పశ్చిమగోదావరి

మహానాడులో సెల్ఫీలతో ఎమ్మెల్యే మొడియం హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, మే 27: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు సెల్ఫీలతో హల్‌చల్ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో రాష్ట్ర మహానాడు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. గత రెండురోజులుగా కానూరులోనే మకాం వేసి, మహానాడు నిర్వహణలో తలమునకలయిన నేతల్లో ఉత్సాహం కలిగిస్తూ పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు హల్‌చల్ చేస్తున్నారు. స్వతహాగా చురుకైన వ్యవహార శైలి కలిగిన మొడియం తమ పార్టీ పండుగ కావడం, తన సహచర ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలు అంతా ఒకచోట కలిసేసరికి ఒకింత రెట్టించిన ఉత్సాహంతో వ్యవరించడం సాధారణమే. మహానాడు సభలో ఒకే వరుసలో కూర్చొన్న పశ్చిమగోదావరి జిల్లా శాసనసభ్యులను చూసేటప్పటికి కలిగిన ఆనందంతో ఆ దృశ్యాన్ని తన సెల్ కెమేరాలో సెల్ఫీ తీసి బంధించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మొడియం శ్రీనివాసరావు తన వాక్చాతుర్యంతో మహానాడులో అంతా తానై దూసుకుపోతున్నారని తోటి ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారని మహానాడుకు హాజరైన నేతలు చెబుతున్నారు.
సరస్వతి పాదుకల యాత్రకు అపూర్వ స్వాగతం
మొగల్తూరు, మే 27: మండల కేంద్రం మొగల్తూరులో ఆదివారం ఉదయం కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర్ సరస్వతీ మహాస్వామి వారి పాదుకా మహాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఇచ్చాపురం నుంచి తిరుపతి పుణ్య క్ష్రేతానికి వెళ్లుతూ మార్గమధ్యలోని మొగల్తూరు గ్రామంలోకి ప్రవేశించగానే గ్రామస్థులు, గ్రామ ప్రముఖులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా శివారు మొగల్తూరు నుంచి యాత్ర ఆరంభమైనట్టు నిర్వాహకులు స్థానిక విలేఖర్లకు తెలిపారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో స్వామివారి వద్ద పాదుకులను ఉంచి గ్రామానికి చెందిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భానుడి భగభగలతో భక్తుల ఇక్కట్లు
ద్వారకాతిరుమల, మే 27: శ్రీవారి క్షేత్రంలో భానుడి భగభగలకు భక్తులు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తె కావడంతో గత రెండురోజులుగా వాతావరణం నిప్పులు చెరుగుతోంది. దీనితో స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు కష్టాలు తప్పడంలేదు. వేసవి సెలవులు కావడంతో అధికారుల అంచనాలకు మించి ఆదివారం భక్తులు క్షేత్రానికి విచ్చేశారు. దీనితో దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేసినా యాత్రికులకు కష్టాలు తప్పలేదు. భక్తుల సౌకర్యార్థం అనివేటి మండపం పక్కన తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటుచేశారు. అయితే ఆ క్యూలైన్లు సైతం చాలకపోవడంతో భక్తులు ముసుగులతో ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. తాత్కాలిక క్యూలైన్ల వద్ద షామియానా పందిళ్లను ఏర్పాటుచేశారు. అవసరాన్ని బట్టి భక్తుల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు మరికొన్ని ముఖ్యప్రదేశాల్లో అదనపు పందిళ్లను నిర్మిస్తున్నారు. దాతల సహాయంతో దేవస్థానం ఆలయంలోని పలు ప్రధాన కూడళ్లల్లో కూలర్లను సైతం ఏర్పాటుచేశారు. అలాగే తివాచీలను సైతం ఆలయ ప్రాంగణంలో పర్చడంతో ఎండవేడిమి నుంచి భక్తులకు కాస్త ఉపశమనం లభిస్తోంది. అలాగే దర్శనం క్యూలైన్లలో ఉండే భక్తులకు ఆలయ సిబ్బంది నిరంతరాయంగా మంచినీటిని అందజేస్తున్నారు.