వరంగల్

కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూన్ 16: తెలంగాణలో తొలి తెలుగు పత్రికకు పురిటిగడ్డ వినుతికెక్కి చారిత్రకంగా గుర్తింపుపొందిన ఇనుగుర్తిలో విజ్ఞాన ప్రచారిణి అనే సం స్థను నెలకొల్పి ‘తెనుగు పత్రిక’ అచ్చువేసిన ఒద్దిరాజు సోదరుల నివాస గృహం శిథిలావస్థకు చేరింది. గ్రామానికి చెందిన ఒద్దిరాజు సీతారామచందర్‌రావు, రాఘవరంగారావు అనే ఇద్దరు సోదరులు 1922 ఆగస్టు 28న ఇనుగుర్తిలో తెలంగాణలో ‘తొలి తెలుగు పత్రిక’ను ముద్రించారు. స్వతహాగా కవులైన ఒద్దిరాజు సోదరులు అప్పటి వరకు ఆంధ్రా ప్రాం తం నుండి వెలువడే క్రిష్ణాపత్రికకు తమ రచనలు పంపేవారు. ఈ తరుణంలో నైజాం సర్కార్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల్లో తమ రచనల ద్వారా చైతన్యం తేవడానికి ఒద్దిరాజు సోదరులు నడుంభిగించారు. బందరు వెళ్లి అక్కడ మట్నూరి క్రిష్ణారావు నిర్వహిస్తున్న క్రిష్ణాపత్రిక నిర్వాహనను చూసివచ్చి ఇనుగుర్తిలో తమ స్వగృహంలో ప్రింటింగ్‌కు అవసరమైన కాలితో నిర్వహించే ప్రింటింగ్ మిషన్ (పెడస్టల్ ప్రింటర్)ను తెచ్చి అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి పత్రికకు చందాదారులను చేర్పించడంతో పాటు రచనలు, పత్రికను పంపేందుకు పోస్ట్ఫాసును కూడా నెలకొల్పేందుకు కృషి చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు ఇక్కడ పత్రిక నిర్వహించిన తరువాత పత్రికను మరింత విస్తరించేందుకు ఒరుగల్లుకు మకాం మార్చారు. అయితే ఆ తరువాత నైజాం సర్కార్ తీవ్రమైన ఇబ్బందులు పెట్టడంతో పత్రికను మూసివేశారు. ఇద్దరు సోదరులు కలిసి దాదాపు 130 పుస్తకాలను రచించారు. తెలంగాణలో అప్పటి వరకు ఇంగ్లీష్, ఉర్దు పత్రికలే అచ్చువేస్తుండగా, తెలుగు భాషలో పత్రి క ముద్రించిన చరిత్రకెక్కిన ఒద్దిరాజు సోదరుల నివాస గృహం ప్రస్తుతం ఆలనాపాలన లేక శిథిలంగా మారుతోంది. దాదాపు 125 ఏళ్ల క్రితం డంగు సున్నం తో ప్రత్యేకంగా కళాకృతులతో భవనాన్ని నిర్మించడం విశేషం. కాగా ఒద్దిరాజు సోదరుల వారసులు ఇనుగుర్తిలో నివాసముండకపోవడంతో భవనాన్ని పట్టించుకునేవారు కరువయ్యారని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం చారిత్రక కట్టడాల పరిరక్షణకు నడుంభిగించిన నేపథ్యం లో చారిత్రక నేపథ్యం ఉన్న తొలి తెను గు పత్రిక ముద్రణాలయాన్ని పరిరక్షించి, భావితరాలకు చరిత్రను తెలియజెప్పలని గ్రామస్థులు కోరుతున్నారు.