పశ్చిమగోదావరి

లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చిత్తశుద్ధితో సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జూన్ 17 : ప్రతీ ఒక్కరూ లక్ష్యాలను నిర్ధేశించుకుని చిత్తశుద్ధితో కృషిచేస్తే వాటిని సాధించడం సుసాధ్యమని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛ్భారత్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో స్వచ్ఛ్భారత్ భాగం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతతోనే ఆరోగ్య - సౌభాగ్య భారతం సాధ్యమన్నారు.
నా ఎదుగుదలకు బడే...బాటవేసింది
నా ఎదుగుదలకు బడే...బాట వేసిందని, విద్యాభ్యాసం చేసిన పాఠశాలకు సేవలు అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మాణిక్యాలరావు పేర్కొన్నారు. తాను బీజేపీ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నతస్థాయికి ఎదగడానికి పాఠశాల బాటలు వేసిందన్నారు. తమ పాఠశాలలో పేరుకుపోయిన చెత్తను చీపురుపట్టి శుభ్రం చేయడం ఆనందంగా ఉందన్నారు.
అభివృద్ధికి ఊతమిస్తున్న అమృత్
స్వచ్ఛ్భారత్‌లో భాగంగా చెత్త ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఐదు మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్‌ను పట్టణంలో నెలకొల్పేందేకు స్థలం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే మాణిక్యాలరావు తెలిపారు. అమృత్ పథకం ద్వారా పార్కుల ఏర్పాటు, రోడ్ డివైడర్లలో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
వారానికి రెండు... ఏడాదికి వంద గంటలు
ప్రతీ ఒక్కరూ వారానికి రెండు గంటలు, ఏడాదికి వంద గంటలు స్వచ్ఛత కోసం పాటుపడితే సౌభాగ్య భారతం సుసాధ్యమని ఎమ్మెల్యే మాణిక్యాలరావు పేర్కొన్నారు. గాంధీజీ బాటలో ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్భారత్‌ను ప్రవేశపెట్టారన్నారు. నాటి నుంచి పట్టణంలో నిరాటంకంగా స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కొనసాగడం ఆనంద దాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ బిజేపి ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, బిజేపి నియోజకవర్గ కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు, కౌన్సిలర్ కోట రాంబాబు, జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, కౌన్సిలర్ ఎన్‌వి.సత్యనారాయణ, ఏజిపి కె.వెంకటేశ్వరరావు, వాకర్స్ అధ్యక్షులు ప్రవా శ్రీనివాస్, మాకా శ్రీనివాస్, పాటే నాగేశ్వరరావు, మల్లిపూడి షర్మిల, నానాజీ తదితరులు పాల్గొన్నారు.
‘హోదా’ కోసం మంత్రి జవహర్ సైకిల్ యాత్ర
కొవ్వూరు, జూన్ 17: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మేరు, దొమ్మేరు సావరం గ్రామాల్లో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దానిని సాధించే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ యాత్రలో కొవ్వూరు ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, ఎంపీపీ వి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శబరిమలైలో బడేటి ఎమ్మెల్యే పూజలు
ఏలూరు, : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ధర్మపోరాట దీక్షను విజయవంతంగా సాగాలని కోరుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదివారం శబరిమలైలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఇక్కడ నుంచి బయలుదేరి శబరిమలై చేరుకున్న ఆయన నల్లని వస్త్రాలు ధరించి ఆదివారం శాస్త్రోక్తంగా పంపా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శబరిమలైకు చేరుకుని 18 మెట్ల ముందు అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ మనసు మార్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేలా ఆశీస్సులు అందజేయాలని ఆయన ప్రార్ధించారు. రాష్ట్భ్రావృద్ధికి అపార అనుభవం వున్న చంద్రబాబు సారధ్యంలో టిడిపి ప్రభుత్వం 2019లో కూడా ఘన విజయం సాధించేలా దీవించాలని కోరారు.