పశ్చిమగోదావరి

పోలవరం ప్రాజెక్టు అధికారులకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూన్ 17: పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న నవయుగ ఏజన్సీ ఎండి కె శ్రీ్ధర్, ప్రాజెక్టు సీఈ వి శ్రీ్ధర్, ఎస్‌ఈ రమేష్‌బాబును కృష్ణాజిల్లా నుండి వచ్చిన రైతులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతుందని, ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన్ని దుష్టశక్తులు ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి విఘ్నాలు కలుగకుండా ఉండాలని హనుమాన్‌జంక్షన్‌లోని అభయ ఆంజనేయస్వామి ఆలయం వద్ద, ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి పూజలు చేశామన్నారు. దైవ సన్నిధిలో ఉంచి పూజలు చేసిన శాలువాలతో అధికారులను సన్మానించినట్టు ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మనోధైర్యం ఇవ్వాలని, నిధులు సకాలంలో అందాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్టు ఆయన చెప్పారు. పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి డెలివరీ పాయింటు ద్వారా కుడికాల్వకు వెడుతున్న గోదావరి నీటిని పరిశీలించామని తెలిపారు. పోలవరం నిర్మాణాలను స్వయంగా చూడడంతో ప్రాజెక్టుకు రూపం వచ్చిందన్నారు. పోలవరం ఒక సినిమా అని విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఇక్కడకు వచ్చి చూస్తే వాస్తవం తెలుస్తుందని రైతులతో పాటు వచ్చిన మహిళా సర్పంచ్ యనమదల ఉషారాణి అన్నారు. రైతులు చలసాని బ్రహ్మయ్య, గుండపనేని ప్రసాద్ తదితర 300 మంది రైతులు పాల్గొన్నారు.